2016

తుని ఘటనపై వేధించొద్దు..

తుని ఘటనపై ప్రజలను వేధించ వద్దని టీడీపీ ప్రభుత్వానికి అమలాపురం మాజీ ఎంపీ జి.వి. హర్షకుమార్ సూచించారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జి.వి.హర్షకుమార్ మాట్లాడుతూ... అధికారం మారితే కేసులు మాఫీ అయిపోతాయన్నారు. ఇష్టారాజ్యంగా మాట్లాడ వద్దని టీడీపీ నేతలకు హర్షకుమార్ హితవు పలికారు.

లాలూని రక్షించేపనిలో నితీష్..

బిహార్ మత్స్య, పశు సంవర్థక శాఖ కార్యాలయంలో ముఖ్యమైన ఫైళ్లు మాయమైనట్టు వార్తలు వెలువడ్డాయి. ఇవి దాణా కుంభకోణానికి సంబంధించినవని ఆరోపణలు వస్తున్నాయి. ఫైళ్లు మాయమైన ఘటనపై పట్నాలోని పాత సచివాలయం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.బిహార్ లో ప్రస్తుతం జేడీయూ, ఆర్జేడీ కూటమి అధికారంలో ఉంది. దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ను రక్షించేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు.

బాబూ ..దీక్ష ఢిల్లీలో చెయ్యి ..

సిపిఎం మినహా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర విభజనను కోరాయని, అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించారంటూ గొంతు చించుకుంటున్న చంద్రబాబు రెండుసార్లు విభజనకు అనుకూలంగా లేఖలిచ్చారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గుర్తు చేశారు. ఈ విషయాన్ని మరుగుపడేసి, అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించారంటూ ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు.2008 అక్టోబర్‌ 18, తర్వాత 2012 డిసెంబర్‌ 27న ప్రణబ్‌ ముఖర్జీ, సుశీల్‌కుమార్‌ షిండేకు చంద్రబాబు ఇచ్చిన లేఖలను బహిర్గతం చేశారు. 

కేరళలో సోనియాపై FIRనమోదు

 కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీపై కేరళలో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. కేరళలోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ భవనం నిర్మించిన కాంట్రాక్టర్‌ ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. సోనియాగాంధీ 2005లో ఈ ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభోత్సవం చేశారు. బకాయిలు చెల్లించాలని కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లీగల్‌ నోటీసులు పంపడంతో కేపీసీసీని బకాయిలు చెల్లించాల్సిందిగా ఆదేశించారు. కానీ చెల్లించకపోవడంతో ఇప్పుడు ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

దళితులు - భూమి - అంబేద్కర్‌

డాక్టర్‌ బిఆర్‌ అంబే ద్కర్‌ ప్రధానంగా ఆర్థిక శాస్త్రవేత.్త 1915లో కొలంబి యా యూనివర్సిటీలో 'ప్రాచీన భారత వాణిజ్యం'పై పరిశోధ నా పత్రాన్ని సమర్పించి ఎంఎ డిగ్రీని పొందారు. ఆయన అత్యంత శ్రమతో పరిశోధించిన 'నేషనల్‌ డివిడెండ్స్‌ ఆఫ్‌ ఇండియా' అనే పరిశోధనా గ్రంథాన్ని 1916 జూన్‌లో పిహెచ్‌డి కోసం కొలంబియా యూనివర్సిటీకి సమర్పించారు. ఈ గ్రంథం 'ది ఎవల్యూషన్‌ ఆఫ్‌ ప్రిన్సిపుల్‌ ఫైనాన్స్‌ ఇన్‌ బ్రిటిష్‌ ఇండియా' అనే పేరు మీద ప్రకటించబడింది. తరువాత లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్సులో 1916 జూన్‌లో చేరారు.

ముద్రగడ దీక్షకు సంపూర్ణ మద్దతు:VH

ఆంధ్రప్రదేశ్‌లో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్షకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు ప్రకటించారు. కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌ ఇప్పటిది కాదన్నారు. తునిలో విధ్వంసంయ సృష్టించింది అసాంఘిక శక్తులని... కాపులు శాంతి కాములకులని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. నేడు కాపులను ఎందుకు అరెస్టు చేయిస్తున్నారని వీహెచ్‌ ప్రశ్నించారు.

హోదాపై జవాబివ్వని స్మృతి..

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి విజయవాడ విద్యార్థులు రాజ కీయ కోణంలో ప్రశ్నలు సంధించి ఝలక్‌ ఇచ్చారు. ఆమె విజయవాడ కెబిఎన్‌ కళాశాల విద్యార్థులతో మంగళవారం ఏర్పాటైన ముఖాముఖీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా, విద్యా రంగంలో విదేశీ పెట్టుబడులు, వర్సిటీల్లో రాజకీయాలు తదితర అంశాలపై విద్యార్థులు పలు ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాపై వెనకడుగు ఎందుకని శ్రీదుర్గ అనే ఎంసీఏ విద్యార్థిని మంత్రిని ప్రశ్నించారు. అది తన పరిధిలోని విషయం కాదని మంత్రి జవాబు దాట వేశారు. 

మోదీ గొప్పలు హాస్యాస్పదం:సురవరం

 రెండేళ్లలో అవినీతి రహిత పాలన అందించామని ప్రధానమంత్రి మోదీ గొప్పలు చెప్పుకోవడం హ్యాస్యాస్పదంగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే లలిత్‌ మోదీ, విజయ్‌మాల్యాలు దేశం నుంచి పారిపోయారని... వారిని వెనక్కి రప్పించడంతో మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సుష్మాస్వరాజ్‌, వసుంధర రాజె, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌లపై అవినీతి ఆరోపణలు వస్తే భాజపా ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు.

హోదా బాబుకే..రాష్ట్రానికి రాలేదు:BVR

రాష్ట్ర విభజనతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు హోదా వచ్చిందే తప్ప.. రాష్ట్రానికి మాత్రం ప్రత్యేక హోదా రాలేదని, పైగా తన కొడుక్కీ మంత్రిగా హోదా ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు విమర్శించారు. 

Pages

Subscribe to RSS - 2016