2016

హోదా బాబుకే..రాష్ట్రానికి రాలేదు

సిపిఎం రాష్ట్ర కమిటీ మూడు రోజుల సమావేశాలు మంగళవారం భీమవరంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ ధాన్యానికి ధర లేదు, పామాయిల్‌కు ధర లేదు.. ప్రజలు కొనే వస్తువుల ధరలు మాత్రం మండిపోతున్నాయని విమర్శించారు. కౌలురైతులకు రక్షణగా పెద్దఎత్తున పోరాటం చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విధానాల వల్లే రిజర్వేషన్లపై ఉద్యమాలు వస్తున్నాయన్నారు. తుందుర్రు ఫుడ్‌పార్క్‌ నిర్మించేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోందని, అదే జరిగితే పెద్దఎత్తున పోరాటం తథ్యమని అన్నారు. 

కార్పోరేట్‌ వైద్యానికి ప్రజలను బలిపశువులుగా మారుస్తున్న ప్రభుత్వాలు

అందరికీ ఆరోగ్యం అన్న నినాదం విశ్వసార్వ జనీతకు అద్దంపడుతున్నప్పటికీ మన దేశంలో ప్రజారోగ్యం జాతీయ ఆరోగ్య విధానప్రకటనకు విరుద్దంగా ప్రవేటీకరణ దిశగాపయనించడం ఆందోళన కలిగిస్తున్నది. దేశ ప్రజల్లో మధ్య తరగతి, పేద ప్రజలు 85శాతం మందిదాకా వున్నారు. పేద ప్రజల ప్రధాన ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తుండటం వల్ల ప్రభుత్వరంగంలో నిర్వహించబడుతున్న ఆసుపత్రులకు కార్పెరేట్‌ వైద్యం పెను సవాలుగా మారింది. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడంతో పాటు ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం ప్రభుత్వ బాధ్యతగా, ప్రాథమిక విధిగా పరిగణించవలసివుందని భారత రాజ్యంగంలోని నాలుగవ భాగం ఉద్ఘాటిస్తుంది.

అణువిద్యుత్ కి వ్యతిరేకంగా ఆందోళన

నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు ముందు గుజరాత్ లోని మితివిర్ధిలో నిర్మించి వలసిన అణు విద్యుత్ కేంద్రాన్ని ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడకు తరలిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించడాన్ని సిపియం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని విశాఖ సిపియం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్లు సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు  సిహెచ్.నరసింగరావు తెలిపారు .

సబ్‌ప్లాన్‌ అమలు బాధ్యత మాకొద్దు

షెడ్యూల్‌ తరగతుల ఉప ప్రణాళిక (ఎస్‌సిఎస్‌పి) అమలు, పర్యవేక్షణ, సమీక్ష బాధ్యతలను నీతి అయోగ్‌ నుండి తమకు బదిలీ చేయడం సరికాదని సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తమకు సిబ్బంది కొరతే ఇందుకు కారణమని తెలిపింది. 12వ పంచవర్ష ప్రణాళికకు ఇంకా ఏడాది మాత్రమే గడువున్న నేపథ్యంలో ఇప్పటివరకు కూడా ఆ తర్వాత ప్రణాళికా వ్యవస్థ వుంటుందా లేదా అనే విషయమై తుది నిర్ణయం తీసుకోలేదని సామాజిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

స్వల్ప నష్టాల్లో దేశీయ స్టాక్‌మార్కెట్లు

నేడు దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్‌ ఎక్సే్చంజి సూచీ 65.58 పాయింట్లు నష్టపోయి 26777.45 వద్ద, నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్చంజి నిఫ్టీ 8201 పాయింట్లు నష్టపోయి 19.75 వద్ద ముగిసింది.

గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు

తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని.. సమస్యల పరిష్కారంపై స్పష్టత ఇస్తే అమరావతికి వెళ్లడానికి తమకు అభ్యంతరం లేదని సచివాలయ ఉద్యోగులు తేల్చిచెప్పారు. అంతేకాక స్థానికత, హెచ్ఆర్, రోడ్ మ్యాప్ పై వెంటనే ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ లో సచివాలయ ఉద్యోగులు కృష్ణయ్య, వెంకట్ రాంరెడ్డి, భావన తదితరులు మీడియాతో మాట్లాడారు. కనీస మౌలిక వసతులు కల్పించకుండా వెళ్లమంటే ఎలా? అని వారు ప్రశ్నించారు. 

మథుర ఘర్షణపై సుప్రీం విచారణ

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో జరిగిన ఘర్షణపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని వేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై మంగళవారం విచారణ చేపట్టనుంది. ఈ ఘటనపై న్యాయవాది కామిని జైస్వాల్‌ వేసిన పిటిషన్‌పై పీసీ ఘోష్‌, అమితవ రాయ్‌లతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ రేపు విచారించనుంది.

దీక్ష కాదు.. బాబు భజన

నవనిర్మాణ దీక్ష పేరుతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలను ఆహ్వానించకపోవడం దారుణమని, అవి చంద్రబాబు భజన కార్యక్రమాలుగా మారిపోయాయని నగరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా విమర్శించారు. 'నా నియోజకవర్గంలో జరుగుతోన్న నవనిర్మాణ దీక్షకు ఎమ్మెల్యేనైన నాకే ఆహ్వానం పంపలేదు' అని ఆమె వాపోయారు. సోమవారం తిరుపతి వచ్చిన రోజా విలేకరులతో మాట్లాడారు.

గుల్బెర్గ్ ఊచకోత నిందుతులకు శిక్ష ఖరారు?....

2002 గుజరాత్‌ అల్లర్ల తర్వాత జరిగిన గుల్మార్గ్‌ సొసైటీ నరమేధం కేసులో దోషులుగా తేలిన 24 మందికి అహ్మదాబాద్‌ ప్రత్యేక న్యాయస్థాని ఇవాళ శిక్ష ఖరారు చేయనుంది. 

నల్ల డబ్బు రూ.30 లక్షల కోట్లు

భారత కుబేరులు విదేశాల్లో దాచుకున్న నల్లడబ్బు రూ.30 లక్షల కోట్లుగా నూతన అధ్యయనం ద్వారా అంచానా వేశామని యాంబిట్‌ క్యాపిటల్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. ఇది దేశ జిడిపిలో 20 శాతంగా వున్నట్లు ఆ సంస్థ పేర్కొన్నది. 2016 ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపిని 2.3 లక్షల కోట్ల డాలర్లు(రూ.154 లక్షల కోట్లు)గానూ, నల్లడబ్బును 460 బిలియన్‌ డాలర్లు(రూ.30 లక్షల కోట్లు)గానూ క్యాపిటల్‌ రీసెర్చ్‌ అంచనా వేసింది. 

Pages

Subscribe to RSS - 2016