2016

నీటి పంపకాలపై తొలగని ప్రతిష్ఠంభన..

కేంద్ర జలవనరులశాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్‌జిత్‌ సింగ్‌తో ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు భేటీ ముగిసింది. ఇవాళ్టి భేటీలో కూడా ఇరు రాష్ట్రాల నీటి పంపకాలపై ప్రతిష్టంభన తొలగలేదు. ఎలాంటి అభిప్రాయానికి రాకుండానే సమావేశం ముగిసింది.

ముద్రగడ నివాసంలో కాపు జేఏసీ నేతల భేటీ

ముద్రగడ పద్మనాభంతో కాపు జేఏసీ నేతలు గురువారం సమావేశం కానున్నారు. ముద్రగడ నివాసంలో జరిగే ఈ సమావేశంలో నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు. తుని ఘటనలో కేసులు, కాపు రిజర్వేషన్ల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. 

తెలంగాణది మొండి వాదన..

కేఆర్‌ఎంబీ ఏర్పాటవగానే అమల్లో ఉన్న ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఆయా ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలని ఏపీ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమ అన్నారు. తెలంగాణ తెలిసీ తెలియక మొండి, తొండి వాదన, పిడివాదం చేస్తోందని ఆరోపించారు.

ఉగ్రవాదం ఏదైనా బలయ్యేది అమాయకులే...

సామాజిక అంతర్జా లం లో 2016 మే 14న ఒక వీడియో దుమారం రేపింది. అయోధ్యలో బజరంగ్‌దళ్‌ శిక్షణా శిబిరంలో భాగంగా సభ్యులకు మరణాయుధాలు వాడటంలో శిక్షణ ఇస్తున్నారు. వారి ఉద్దేశం దేశంలో ముస్లిం తీవ్రవాదులను ఎదుర్కోవడం, ఉగ్రవాదాన్ని అంతం చెయ్యడమట! ఆ పనులు చేయడానికి మనం పటిష్టమైన భద్రతా యంత్రాంగాన్ని ఏర్పర్చుకున్నామని వారు మర్చి పోయారా? అదే నెల 30న విహెచ్‌పి మహిళా శాఖ 'దుర్గావాహిని' తన సభ్యులకు మారణాయుధాలలో సైనిక శిబిరం లాంటి శిక్షణ ఇస్తుందని వివిధ వార్తా పత్రికల్లో ప్రచురితమైంది. ఆత్మరక్షణ కోసం శిక్షణ ప్రతి స్త్రీకీ అవసరమైనప్పటికీ మారణాయుధాలతో శిక్షణ వారికి ఏ ఉద్దేశంతో ఇస్తున్నారు?

జీఎస్‌టీపై అభ్యంతరాలు చెప్పిన జయ

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)పై తమకున్న అభ్యంతరాలను జయలలిత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తెలియజేశారు. పరిహారం చెల్లించే కాలవ్యవధి, పన్ను పరిధిలో ఉండని వస్తువులు తదితర అంశాలపై విస్తృత ఏకాభిప్రాయం కోసం కేంద్రప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. తమిళనాడు వంటి తయారీరంగ, ఎగుమతి ఆధారిత రాష్ట్రాలకు జీఎస్‌టీ వల్ల ఆదాయంలో పెద్దఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉందని జయ పేర్కొన్నారు.

మీరు అధికారంలో ఉన్నపుడు ఏం చేశారు..

మాజీ కేంద్ర మంత్రులు దాసరి నారాయణరావు, చిరంజీవి టీడీపీ ప్రభుత్వానికి డెడ్‌లైన్ పెడుతున్నారని, వీళ్లు అధికారంలో ఉన్నప్పుడు కాపులకు ఏం చేశారని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మొండి వైఖరి వీడాలని కోరారు. 

SBIలో SBH విలీనం ఆపాలి:CPM

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎస్‌బీహెచ్‌)ను విలీనం చేసే ప్రక్రియను తక్షణమే ఆపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకులన్నింటిలో అగ్రగామిగా నిలిచి రాష్ట్రంలో రూ.2.50 లక్షల కోట్ల టర్నోవర్‌ కలిగిన ఎస్‌బీహెచ్‌ను విలీనం కాకుండా రక్షించుకోవడం చారిత్రక అవసరమని తెలిపారు. 

గుజరాత్‌లో దళితుల ఆత్మహత్యలు..

 దేశంలోని ప్రతి రాష్ట్రంలో జరుగుతున్న మొత్తం ఆత్మహత్యలతో పోలిస్తే గుజరాత్‌లో దళితులు ఆత్మహత్యలు ఒకటిన్నర రెట్లు అధికంగా ఉన్నాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.ఈ గణాంకాల మేరకు గుజరాత్‌లో ప్రతి లక్ష మంది జనాభాలో 11.7 శాతం మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. వీరిలో ఆత్మహత్యకు పాల్పడుతున్న దళితులు18.7 శాతం మంది ఉన్నారు.

ద్రవ్యోల్బణం 0.79% పెరిగింది...

కూరగాయల ధరలు ఒకేసారి రెండంకెల స్థాయిలో పెరగడంతో మే మాసంలో టోకు ధరల ద్రవ్యోల్బణం 0.79శాతం పెరిగింది. దీంతో సరఫరా విభాగంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించ డానికి విధానపరమైన చర్యలను పారిశ్రామిక రంగం చేపట్టాల్సి వస్తోంది. అటు టోకు, ఇటు రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరగడంతో పారిశ్రామిక ఉత్పత్తి మందగించినప్పటికీ భారత రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లలో కోత విధించడంలో జాప్యం చేయవచ్చునని భావిస్తున్నారు.

లక్షన్నర ఎకరాలకు సాగునీరు సరఫరా చేయొచ్చు

 పోలవరం ఎడమ కాలువకు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని పంపించడానికి అవకాశామున్న పుసుషోత్తపట్నం ప్రాంతం, కాతేరు, పుష్కర ఎత్తిపోతల పథకాలను సిపిఎం బ్రందం పరిశీలించింది. ఈ సందర్భంగా అధ్యయనం బ్రందం తొలి దశలో ఎడమ కాలువ పనులు 58కిలో మీటర్లు వరకు పూర్తిచేసి ఏలేరు నదిలోకి విడిచిపెట్టి ఏలేరు రైతుల ఆయకట్టు 70వేల ఎకరాలకు నీరు అందించడం వల్ల ఏలేరు జలాశయంలో మిగలనున్న 10టిఎంసిల నీటిని విశాఖపట్నం తరలించవచ్చని సూచించారు. రెండో దశలో 58కిలో మీటర్లు నుంచి 162 కిలోమీటర్లు ( ఏలేరు రివర్ క్రాసింగ్ నుంచి తాళ్లపాలెం) వరకు ప్రస్తుతమున్న ఏలేరు నీటిని కెనాల్ ద్వారా నీటిని పంపించవచ్చన్నారు.

Pages

Subscribe to RSS - 2016