
వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)పై తమకున్న అభ్యంతరాలను జయలలిత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తెలియజేశారు. పరిహారం చెల్లించే కాలవ్యవధి, పన్ను పరిధిలో ఉండని వస్తువులు తదితర అంశాలపై విస్తృత ఏకాభిప్రాయం కోసం కేంద్రప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. తమిళనాడు వంటి తయారీరంగ, ఎగుమతి ఆధారిత రాష్ట్రాలకు జీఎస్‌టీ వల్ల ఆదాయంలో పెద్దఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉందని జయ పేర్కొన్నారు.