2016

దళితుల భూములపై ప్రభుత్వ పెత్తనం తగదు

దళితుల భూములపై ప్రభుత్వ పెత్తనం తగదు సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు యడవల్లిలో భూములను పరిశీలించిన సిపిఎం బృందం బాధిత రైతులతో సమావేశం, వివరాలు సేకరణ.

స‌దావ‌ర్తి స‌త్రం భూముల వేలంపై సిట్టింగ్ జ‌డ్జీచే విచారించాలి. సిపియం జిల్లా కార్య‌ద‌ర్శి పాశం రామారావు.

జిల్లాలో ఎంతో ప్రాముఖ్య‌త క‌లిగిన అమ‌రావ‌తి అమ‌ర‌లింగేశ్వ‌ర దేవాస్థానానికి చెందిన స‌దావ‌ర్తి స్ర‌తం భూముల వేలంపై సిట్టింగ్ జ‌డ్జీచే విచార‌ణ జ‌రిపించాలి. చెన్నై న‌గ‌రానికి అతి స‌మీపంలో ఉన్న స‌దావ‌ర్తి స‌త్రానికి చెందిన సుమారు 470 ఎక‌రాలు అతివిలువైన భూములున్నాయి. విటిలో ఆక్ర‌మ‌ణ‌లు పోను మిగిలిన 80 ఎక‌రాల‌కు ఇటీవ‌ల వేలం వేసి కారుచౌక‌గా కొంద‌రు పొందిన‌ట్లు తెలుస్తుంది. విలువైన దేవాల‌యా భూముల‌ను వేలం వేసేట‌ప్పుడు ముందుగా త‌గిన ప్ర‌చారం ఇవ్వాలి, నోటిఫికేష‌న్ అన్ని ప్ర‌ముఖ ప‌త్రిక‌ల్లో ప్ర‌చ‌రించాలి. ఇటువంటివి ఏమి జ‌ర‌గ‌కుండా వేలం వేయ‌డ‌మంటే చ‌ట్ట‌విరుద్ద‌మైన చ‌ర్య‌.

NBTపైనా స్మృతి ఇరానీ పెత్తనమే..

సాహిత్య ప్రియులకు ప్రోత్సాహకరంగా గత ఆరు శతాబ్దాలుగా పనిచేస్తున్న ‘నేషనల్ బుక్ ట్రస్ట్’పైనా కాషాయం రంగు పడింది. ఆర్థిక అవకతవకలకు అవకాశం లేకుండా పుస్తకాల క్రయవిక్రయాల ఆర్థిక లావాదేవీలను ఓ ప్రైవేటు ప్రొఫెషనల్ కంపెనీకి టెండర్ ప్రక్రియ ద్వారా అప్పగించే వ్యవస్థను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఏకపక్షంగా రద్దు చేశారు. ఈ విషయంలో నేషనల్ బుక్ ట్రస్ట్ చైర్మన్‌నుగానీ, ట్రస్టీ సభ్యులనుగానీ ఏమాత్రం సంప్రతించకుండానే ఏకపక్షంగా ఆమె నిర్ణయం తీసుకున్నారు.

RBI గవర్నర్‌గా రాకేశ్‌ మోహన్‌?

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తదుపరి గవర్నరుగా ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ రాకేశ్‌ మోహన్‌ నియమితులయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వాషింగ్టన్‌లోని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐంఎంఎఫ్‌)లో మన దేశం తరఫున ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా మోహన్‌ ఉన్నారు.

ఎగవేతదారుల ఆస్తులను మాత్రమే వేలం..

ఆదాయపుపన్ను శాఖ ఉద్దేశపూర్వక పన్ను ఎగవేతదారులుగా ప్రకటించిన జాబితాలోని ఆస్తులను మాత్రమే వేలం వేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. ఇప్పటివరకు ఇటువంటివి దాదాపు 63 పేర్లు మాత్రమే ప్రకటించింది. ఈ జాబితాలో కొందరి ఆచూకీ లేదని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు.

సింగపూర్‌ కంపెనీలకు భూ పందేరం

 రాజధానిలో భూ పందేరం మొదలైంది. అమరావతి డెవలప్‌మెంట్‌ కంపెనీ పేరుతో స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌(ఎస్‌పీివి)ఏర్పాటు చేసి దాని ద్వారా సింగపూర్‌కు భూములు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం సీడ్‌ క్యాపిటల్‌ ఏరియాలో భూములు ఎంపిక చేశారు. సచివాలయ నిర్మాణ పనులకు అవసరమైన నిధులు కేంద్రం నుండి వచ్చే పరిస్థితి లేదని, ఈ సమయంలో ముందడుగు వేయకపోతే పనులు ఆలస్యమె ప్రభుత్వానికి ఇబ్బంది ఏర్పడుతుందని రాజధాని అభివృద్ధి కమిటీ సభ్యుడొకరు తెలిపారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని, వెంటనే భూములు కేటాయిస్తే సింగపూర్‌ కంపెనీలు నిర్మాణాలు మొదలుపెడతాయని, ఇది రాజధాని అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. 

ఏపీభవన్ ప్రాంతాన్నితిరిగి ఇచ్చే‌యండి:KCR

ఏపీ భవన్ గా మారిన ఢిల్లీలోని ప్రాంతాన్ని తమకు తిరిగి ఇచ్చి వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. ఆ స్థలాన్ని తమకు అప్పగిస్తే, తాము తెలంగాణ భవన్ ను నిర్మించుకుంటామని లేఖలో పేర్కొన్నారు.

దేశానికి చేటు..

కేంద్రంలో గత కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డిఐ) కిటికీలు తెరవగా ప్రస్తుత బిజెపి సర్కారు తలుపులు బార్లా తెరిచి కాంగ్రెస్‌ కంటే 'విభిన్నత'ను చాటుకుంది. గతేడాది నవంబర్‌లో కొన్ని కీలక రంగాల్లోకి ఎఫ్‌డిఐలను స్వేచ్ఛగా ఆహ్వానిస్తూ మోడీ ప్రభుత్వం తీర్మానించగా తాజాగా సోమవారంనాడు ఆదరాబాదరగా ప్రధాని ఆధ్వర్యంలోని ఉన్నతస్థాయి కమిటీ సమావేశమై ఎఫ్‌డిఐలకు మరింతగా ద్వారాలు వెడల్పు చేసింది. ఈ దెబ్బతో అదీ ఇదీ అనే తేడా లేకుండా దేశంలోని దాదాపు అన్ని రంగాల్లోకీ ఎఫ్‌డిఐలు చొరబడేందుకు ఆస్కారం కల్పించింది.

Pages

Subscribe to RSS - 2016