రోజురోజుకూ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలోనూ, నిరుద్యోగాన్ని అరికట్టడంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఎం నాయకులు వేమారెడ్డి అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం దేవాపురంలో అధిక ధరలకు నిరసనగా ప్రదర్శన నిర్వహించారు. వేమారెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు తగ్గినా ఇక్కడ ధరలు తగ్గించకుండా సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి కల్పించిన ఈ ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా నిరనన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ సంస్థలకు రాయితీలు కల్పిస్తూ పేద ప్రజలకు కనీస అవసరాలైన విద్య, వైద్యం కల్పించడంలేదని అన్నారు.