ఆర్‌బీఐ గవర్నరుగా అరవింద్‌ పనగారియా..

ఆర్‌బీఐ గవర్నరుగా రఘురాం రాజన్‌ పదవీకాలం సెప్టెంబరు 4తో ముగియనుంది. రెండోవిడత ఈ పదవిలో కొనసాగబోనని, గత నెలలో రాజన్‌ ప్రకటించినప్పటి నుంచీ, ఆయన వారసత్వం ఎవరికి దక్కుతుందనే విషయమై పలు వూహాగానాలు వస్తున్నాయి. మరో రెండురోజుల్లోనే ఆర్‌బీఐ తదుపరి గవర్నర్‌ ఎవరో తేలుతుందని, పనగారియాకు అధిక అవకాశాలున్నట్లు తాజాగా ప్రచారం సాగుతోంది. ఈనెల 18లోగా ఆర్‌బీఐ గవర్నరు పదవిపై నిర్ణయం తీసుకుంటామని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.