
ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధినేత్రి మాయావతికి మరో షాక్ తగిలింది. బీఎస్పీ నుంచి మరో కీలక వ్యక్తి పార్టీకి దూరమయ్యారు.దాదాపు 35 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేసిన బీఎస్పీ జాతీయ కార్యదర్శి పరందేవ్ యాదవ్ తన పదవికి రాజీనామా చేశారు. గత నెల రోజుల వ్యవధిలో నలుగురు ముఖ్య నేతలు పార్టీని వీడటం గమనార్హం.