2016

విభజన కేసు విస్తృత ధర్మాసనానికి

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ అయింది. హైకోర్టు విభజన తీర్పును సమీక్షించాలన్న వ్యాజ్యాన్ని సీజే ధర్మాసనం ... విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏపీలోనే ఉండాలనే అంశాన్ని సమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే.

పాక్లో రాజ్నాథ్ పర్యటన

కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ వచ్చే నెల 3,4 తేదీల్లో పాకిస్తాన్లో పర్యటించనున్నారు. ఇస్లామాబాద్లో జరిగే  దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి(సార్క్) హోంమంత్రుల సదస్సులో ఆయన పాల్గొంటారు.

భారత్ అమెరికా నిఘా విమానాల ఒప్పందం

నాలుగు నిఘా విమానాల కొనుగోలు కోసం అమెరికాతో భారత్ బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 6,700 కోట్లు) ఒప్పందం కుదుర్చుకుంది. దీర్ఘశ్రేణి సముద్ర నిఘా వ్యవస్థ కలిగిన, జలాంతర్గామి విధ్వంసక యుద్ధ విమానాలు ‘పోసిడాన్-8ఐ’(పీ-8ఐ)లను కొనేందుకు అమెరికా రక్షణ శాఖ, విమానాల తయారీ సంస్థ బోయింగ్‌తో దీన్ని కుదుర్చుకుంది. 

ప్రత్యేక హోదా బిల్లుపై షార్ట్ లిస్ట్‌

ఏపీ ప్రత్యేక హోదా బిల్లుపై రాజ్యసభలో ఎవరెవరు చర్చించాలో పార్లమెంట్ అధికారులు షార్ట్ లిస్ట్‌ను ఖరారుచేశారు. ఈ లిస్ట్‌లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు జైరామ్‌ రమేష్‌, టి. సుబ్బరామిరెడ్డి, దిగ్విజయ్ సింగ్‌... అలాగే టీడీపీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్‌, సీఎం రమేష్, తోట సీతారామాలక్ష్మీ, గరికపాటి రామ్మోహన్‌రావు ఉన్నారు.

విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి

ఎయిర్‌ఫోర్స్‌ విమానం ఎఎన్‌-32 ప్రమాద దుర్ఘటనపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు డిమాండ్‌ చేశారు. మంగళవారం సాయంత్రం బాధిత కుటుంబాలను పరామర్శించారు. తొలుత బుచ్చిరాజుపాలెంకు చెందిన నమ్మి చిన్నారావు, లక్ష్మీనగర్‌కు చెందిన నాగేంద్ర కుటుంబ సభ్యులను కలుసుకుని ఓదార్చారు. అనంతరం అక్కడ నుంచి వేపగుంటలోని గంట్ల శ్రీనివాసరావు, అప్పన్నపాలెంలోని సాంబమూర్తి ఇళ్లకు వెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి వారికి మనోధైర్యం కలిగించారు.

జికె.వీధి మండలంలోని 8 పంచాయతీలకు నిరంతర విద్యుత్‌ కల్పించండి

             జిల్లాలోని జికె.వీధి మండలంలోని 8 పంచాయతీలకు చెందిన 50 గ్రామాలకు నిరంతం విద్యుత్‌ సదుపాయం కల్పించాలని, సోలార్‌ విద్యుత్‌ కాంట్రాక్టర్‌పై చర్య తీసుకోవాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం నేతృత్వంలో ఆయా గ్రామాల నాయకులు మంగళవారం ఎపిఇపిడిసిఎల్‌ డైరెక్టర్‌ (ఆపరేషన్‌ ప్రాజెక్టులు) బి.శేషుకుమార్‌, చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ విజయలలితలకు వినతిపత్రం అందజేశారు.

గో వథపై రగులుతున్న గుజరాత్..

ఉనా పట్టణంలో గో వథకు పాల్పడ్డారనే అనుమానంతో దళిత యువకులను అమానుషంగా హింసించిన ఘటనకు నిరసనగా గుజరాత్‌లో దళితుల ఆందోళన భగ్గుమంది. గురు వారం కూడా పలుచోట్ల ఆందోళనలు, అల్లర్లు చోటు చేసుకున్నాయి. సూరత్‌, రాజ్‌కోట్‌లలో దళితులు భారీ నిరసన ర్యాలీలు నిర్వహించారు.

దయాశంకర్‌ నాలుక కోస్తే రూ.50 లక్షలు..

మాయావతిపై వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం రాజ్యసభలో బీఎస్‌పీ, కాంగ్రెస్‌, సీపీఐ(ఎం)తోపాటు ప్రతిపక్షాలు నిలదీయడంతో అధికార పార్టీ నష్ట నివారణా చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.దయాశంకర్‌ వ్యాఖ్యలకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోనూ బీఎస్‌పీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. చండీగఢ్‌లో బీజేపీ కార్యాలయం ముందు ఆందోళన సందర్భంగా స్థానిక బీఎస్‌పీ చీఫ్‌ జన్నత్‌ జహాన్‌ తీవ్ర హెచ్చరిక చేశారు. దయాశంకర్‌ నాలుక కోసినవారికి రూ.50 లక్షలు బహుమతి ఇస్తానని ఆమె ప్రకటించారు. 

YCP MPలతో వెంకయ్య బిజీ

ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న జీఎస్టీ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం విపక్షాలతో చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం వైఎస్సార్ సీపీ ఎంపీలతో మాట్లాడారు. జీఎస్టీ బిల్లుకు మద్దతు తెలపాలని కోరారు. దీనికి వైఎస్సార్ సీపీ ఎంపీలు కూడా సానుకూలంగా స్పందించారు.

Pages

Subscribe to RSS - 2016