నాటి ముఖ్యమంత్రి యన్‌టి రామారావు, ఎస్‌ఆర్ శంకరన్‌ల ఆధ్వర్యంలో 1983లో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతి కోసం ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేశారు. అవి సాధారణ హాస్టళ్ళ కంటే మెరుగైన విద్య, క్రమశిక్షణ వంటి విషయాల్లో మంచి ఫలితాలు సాధిస్తూ నడుస్తున్నాయి. 1987లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలను కలిపి ఎపిఎస్‌డబ్ల్యుఆర్‌ఇఐ సొసైటీ పేరుతో రాష్ట్ర సంస్థగా ఏర్పాటు చేశారు. కొన్ని సంవత్సరాలపాటు విద్యావేత్తల ఆధ్వర్యంలో ఇవి సజీవంగా నడిచాయి. ఆ తరువాత ఈ సంస్థ స్థాయి పెంచి ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను కార్యదర్శులుగా నియమించారు.