
ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి, కేవీపీ తదితర రాష్ట్ర నేతలు రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లుపై చర్చించారు... బిల్లుకు ఇతర పార్టీల మద్దతు కూటగట్టడంపై సమాలోచనలు జరిపారు. పార్లమెంట్ లో కేవీపీ ప్రవేశపెట్టనున్న ప్రైవేటు బిల్లు, దాని పై అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించారు.