2016

సుజనాను నిలదీసిన ప్రతిపక్షాలు

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా చర్చ సందర్భంగా రాజ్యసభలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇరుకున పడ్డారు. ప్రత్యేక హోదా డిమాండ్ పై తన గళాన్ని గట్టిగా వినిపించలేక, తాను మంత్రిగా కొనసాగుతున్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించలేక ఆయన ఇబ్బందికి గురయ్యారు. ప్రభుత్వం తరపునా మాట్లాడుతున్నారా, పార్టీ తరపున మాట్లాడుతున్నారా అని విపక్ష సభ్యులు ఆయనను ప్రశ్నించారు. 

ఒంటరవుతోన్న బిజెపి..

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంపై రాజ్యసభలో వాడీ వేడి చర్చ జరిగింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ సహా సభలోని పలు రాజకీయ పార్టీలు ఏపీ బిల్లుకు మద్దతు పలికాయి. మద్దతు పలికిన వారిలో సమాజ్‌ వాదీ పార్టీ, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ, బీజేడీ, టీఎంసీ సహా దాదాపు అన్ని పక్షాలు విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశాయి. దీంతో సభలో అధికార బీజేపీ ఇరుకున పడినట్లయ్యింది.

లబ్ధి పొందేదెవరు?

సింగపూర్‌ ప్రభుత్వమే రాజధానికి సహాయం చేస్తున్నదని మరో అబద్ధం విస్తృత ప్రచారంలో ఉంది. సింగపూర్‌ కన్సార్టియంలోని సంస్థలన్నీ ప్రయివేటువే. సింగపూర్‌ ప్రభుత్వం నయా పైసా ఇవ్వడంలేదు. వారుచేసేది సహాయంకాదు. పక్కా వ్యాపారం మాత్రమే. కన్సార్టియంలోని సింగపూర్‌ కంపెనీలకు మూల సంస్థ టెమ్‌శాక్‌లో వివిధ దేశాలవారి పెట్టుబడులున్నాయి. మన రాష్ట్రానికి చెందిన నేతలకు వాటాలున్నాయి. రాష్ట్రంలో ఈ కంపెనీ థర్మల్‌ ప్రాజెక్టులు నిర్మిస్తూ లాభాలు గడిస్తున్నది. భవిష్యత్‌లో వీటిలో ఎవరైనా వాటాలు కొనవచ్చు.

ఆంధ్రాపై బిజెపి-టిడిపి దుష్ట వ్యూహం

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ ముందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా అంశమై ప్రయివేట్‌ మెంబర్‌ బిల్లు ఎన్డీయే పక్షాల నాటకీయ పరిణామాలతో వెనక్కి వెళ్లింది. సభలో ఎక్కడైనా విపక్షం ఆందోళన చేస్తుంది. కానీ ఆరోజు అధికార పక్షమే ఆందోళనకు నడుం కట్టింది. సభకు సంబంధం లేని అంశాన్ని సాకుగా చూపించి సభను అడ్డుకుంది.

హోదా కోసం రాజ్యసభలో పార్టీల డిమాండ్‌

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభలో అన్ని రాజకీయ పక్షాలు గురువారం ముక్త కంఠంతో డిమాండ్‌ చేశాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనిపై తన వైఖరిని వెల్లడించలేదు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడినప్పటికీి ప్రత్యేక హోదాకు సంబంధించిన ఊసే లేదు . ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం అమలు తీరుపై రాజ్యసభలో గురువారం మూడున్నర గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగింది.

AP ఉమ్మడి ఆస్తుల విభజనకు కమిటీ

ఉమ్మడి ఏపీ ఆస్తుల విభజనకు కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశామని ఆ శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం అహిర్‌ వెల్లడించారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ అడిగిన ఓ ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిస్తూ.. కమిటీలో ఏపీ, తెలంగాణ రాషా్ట్రల నుంచి ఇద్దరికి చొప్పున ప్రాతినిధ్యం కల్పించామన్నారు.

రాజ్యసభకు జీఎస్‌టీ బిల్లు !

జీఎస్‌టీ (వస్తువులు, సేవల పన్ను) బిల్లు చుట్టూ పరచుకున్న తెరలు తొలగబోతున్నాయి. ఈ బిల్లుకు సవరణలను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగీకారం తెలిపాయి. దీంతో ఈ బిల్లును శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెల 12తో ముగియనున్న ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లు ఆమోదం పొందుతుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. 

దయాశంకర్‌కు అలహాబాద్‌ కోర్టులో చుక్కెదురు

పరారీలో ఉన్న భాజపా బహిష్కృత నేత దయాశంకర్‌ సింగ్‌కుఅలహాబాద్‌ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన అరెస్టుపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. దయాశంకర్‌ అరెస్టుపై స్టే విధించేది లేదని లఖ్‌నవూ బెంచ్‌ తీర్పు చెప్పింది. దీనిపై యూపీ ప్రభుత్వం వారంలోగా స్పందించాలని సూచించింది.

పార్లమెంట్లో మోడీని నిలదీసిన రాహుల్

పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డైరెక్ట్ అటాక్ చేశారు. ధరల పెరుగుదలపై నిలదీశారు. గతంలో హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచార సభలో మోదీ తాము అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి ఆచరణలో విఫలమయ్యారని ఆరోపించారు. ధరలు తగ్గించే తేదీని ప్రకటించాలని రాహుల్ కోరారు. ధరలను ఎప్పుడు నియంత్రించగలరో, ద్రవ్యోల్బణాన్ని ఎప్పుడు తగ్గిస్తారో తెలపాలని డిమాండ్ చేశారు.

Pages

Subscribe to RSS - 2016