
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంపై రాజ్యసభలో వాడీ వేడి చర్చ జరిగింది. ప్రతిపక్ష కాంగ్రెస్ సహా సభలోని పలు రాజకీయ పార్టీలు ఏపీ బిల్లుకు మద్దతు పలికాయి. మద్దతు పలికిన వారిలో సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ, బీజేడీ, టీఎంసీ సహా దాదాపు అన్ని పక్షాలు విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో సభలో అధికార బీజేపీ ఇరుకున పడినట్లయ్యింది.