2016

బాబూ..కుట్రలు మాని కలసిరా..

ఏపీకీ ప్రత్యేక హోదా కోరుతూ శుక్రవారం రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లు విషయంలో ఎలాంటి కుట్రలు చేయకుండా ఓటింగ్‌కు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కోరారు.ఆయన గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బిల్లు శుక్రవారం ఓటింగ్‌కు రాకుండా చేయడానికి చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనం ఎందుకు?

సాధారణంగా విత్తసంస్థలు (ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్స్‌) తమ ప్రాథమిక విధులు; సమాజంలో ఏర్పడే పొదుపు సమీకరించి ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచే పెట్టుబడులకు ఉపయోగపడే సంస్థలుగా, వ్యక్తుల పొదుపులను వారి జీవితకాలంలో ఆ తర్వాత నూతన తరాలకు మేనేజ్‌ చేసే సంస్థగా, క్రమానుగత చెల్లింపు చేసే సంస్థగా, నష్టభయాలను (రిస్క్‌) మేనేజ్‌చేయటం, బదిలీ చేయటం వంటి విధులు నిర్వహిస్తుంటాయి. కానీ ప్రపంచీకరణ, ఉదారీకరణ ఆర్థిక విధానాల ద్వారా బడా విత్తసంస్థలు నిజ ఆర్థిక వ్యవస్థ రంగాలకు వాటి వృద్ధికి దోహదపడే విత్తవనరులు సమకూర్చటం లేదు.

ప్రత్యేక బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్‌..

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ ఏపీ పున ర్వ్యవస్థీకరణ బిల్లులో సవరణ చేయాలంటూ కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై శుక్రవారం ఓటింగ్‌ జరుగనుంది. 

పోలీసుల మౌనం ఎందుకు ..? :కేజ్రీ

గుజరాత్ లో దళితులను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు.  రాజ్కోట్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉనా ఘటన బాధితులను ఆయన శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. ఉనాలో దళితులపై దాడి చేసిన వారిపై పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు.

దళితులకు ఆర్థిక సాధికారత:ఏచూరి

దళితులపై దాడులు నివారించాలంటే మహాత్మగాంధీ చెప్పినట్టుగా 'మనసు' మార్చుకుంటే సరిపోదని, అణగారిన వర్గాలకు ఆర్థిక సాధికారత కల్పించాలని సీపీఐ(ఎం) రాజ్యసభాపక్ష నేత సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. దళితులపై దాడులు చేసేందుకు నూతన ద్వారాలు తెరిచిందని విమర్శించారు. గోసంరక్షణ, యూనివర్శిటీలు, అవమానకర వ్యాఖ్యలు ఇవన్నీ అందులో భాగమని చెప్పారు. దళితులపై బీజేపీ ఆలోచనా వైఖరిలో మార్పురావాలన్న ఏచూరి... సమాజంలో ఆధ్యాత్మిక ఆలోచనలకు బదులు రాజ్యాంగంలో పేర్కొన్నట్టుగా శాస్త్రీయ దృక్పథం పెంపొందించాల్సిన అవసరముందన్నారు. 

రాజకీయాల కోసమే దళితుల విభజన

రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దళితులను విభజించే కుట్రలు పన్నుతున్నార ని మాల మహానాడు మండిపడింది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మాల మహానాడు చేపట్టిన నిరసన కార్యక్రమాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అనేది సుప్రీం కోర్టు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ల తీర్పులకు విరుద్ధమన్నారు.

కనీస వేతనాల చట్టాన్నిసవరించండి

రాష్ట్రంలో తక్షణమే కనీస వేతనాల సలహా మండలిని ఏర్పాటు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు కోరారు. పదేళ్లుగా కనీస వేతనాల చట్టాన్ని సవరించలేదన్నారు. దీంతో ప్రతి నెలా కార్మికులు రూ.500 కోట్లు నష్ట పోతున్నట్లు తెలిపారు. 65 షెడ్యూల్స్‌లోని కార్మికులు, అంగన్‌వాడీ వర్కర్లు, విఆర్‌ఎ, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎంఎ గఫూర్‌ విజయవాడలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును గురువారం కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. 

Pages

Subscribe to RSS - 2016