కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంట్ కు వ్యతిరేకం..

శ్రీకాకుళం జిల్లా రణస్ధలంలో కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంట్ కు వ్యతిరేకంగా జరుగుతున్న సదస్సుకు సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ ప్రకాశ్ కరత్ హాజరయ్యారు .భారత్ దేశంలో ఎక్కడా లేనటువంటి ఒకే చోట ఆరు రియాక్టర్లు పెట్టటం అనేది పెను ప్రమాదకరమని తెలిపారు.ఒకే ప్రదేశంలో ఆరు రియాక్టర్లు ఏర్పాటు చేస్తే.. ఒక్క కొవ్వాడ ప్రాంతానికే కాదు..ఉత్తరాంధ్రలో వున్నటువంటి మూడు జిల్లాలకు తీవ్రమైన పెను ప్రమాదం పొంచి వుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గతంలో మన్ మోహన్ సింగ్ ప్రభుత్వ ఉన్నప్పటి నుండీ సీపీఎం పార్టీ పోరాడుతోందన్నారు. ఇప్పుడు ప్రభుత్వం అమెరికాకు చెందిన కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవటానికి యత్నిస్తోందని తెలిపారు. దీనికి సంబంధించి పెట్టుబడి రూ.2లక్షల 80 వేల కోట్లు అవుతుందన్నారు. జపాన్ లో అణు రియాక్టర్లు పేలి ఎంత విధ్వంసం జరిగిందో మనందరికీ తెలుసనీ..అటువంటి ప్రమాదకర అణు రియాక్టర్లను ఈ ప్రదేశం ఏర్పాటు చేయటం పెను ప్రమాదానికి దారితీస్తాయన్నారు. ఈ ప్రదానికి గురయిన వారు ఇప్పటికింకా కోలుకోలేదని తెలిపారు.