
ఆంధ్రప్రదేశ్‌లో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్షకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ప్రకటించారు. కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్ ఇప్పటిది కాదన్నారు. తునిలో విధ్వంసంయ సృష్టించింది అసాంఘిక శక్తులని... కాపులు శాంతి కాములకులని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. నేడు కాపులను ఎందుకు అరెస్టు చేయిస్తున్నారని వీహెచ్ ప్రశ్నించారు.