
గిరిజనుల పార్టీ ఇండీజనెస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ) లేవనెత్తిన ప్రత్యేక రాష్ట్రం 'త్రిప్రా ల్యాండ్' డిమాండ్‌ను త్రిపురలోని ప్రధాన రాజకీయ పార్టీలు తిరస్కరించాయి. పాలక సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి విజన్ ధర్ మాట్లాడుతూ విచ్ఛిన్నకరమైన, బాధ్యతారాహిత్యం, రాజకీయ దురుద్దేశంతో కూడిన ఈ డిమాండ్‌ను తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. అసలే చిన్న రాష్ట్రమైన త్రిపురను ఇంకా విభజించాలన్న ఈ డిమాండ్ తమకు ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని అన్నారు.