మాల్యా కోసం రెడ్‌ కార్నర్‌ నోటీసులు:ED

బ్యాంకు రుణాల ఎగవేత కేసులకు సంబంధించి విచారణ ఎదుర్కొంటూ విదేశాల్లో తలదాచుకున్న పారిశ్రామికవేత్త విజరు మాల్యాకు వ్యతిరేకంగా రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఇంటర్‌పోల్‌కు లేఖ రాసింది. మనీలాండరింగ్‌ కేసులో విజరు మాల్యాకు అరెస్టు వారెంట్‌ను నోటిఫై చేసేందుకు ముందుగా ఇంటర్‌పోల్‌ కొన్ని వివరణలను కోరింది. మాల్యా కేసుల విచారణ, ఆయనకు వ్యతిరేకంగా ఆయా కోర్టులు జారీ చేసిన అరెస్ట్‌ వారెంట్ల వివరాలతో కూడిన సమాచారాన్ని ఇంటర్‌పోల్‌కు ఈడీ అందించింది.