వస్తువులు, సేవల అమ్మకంతో పాటు ఆన్‌లైన్‌లో జరిపే కొనుగోళ్లు అన్నింటికీ జీఎస్‌టీ అమలవుతుందని, లావాదేవీ తొలి అంకం (మూలం వద్దే) ఈ పన్ను విధించాలని నమూనా జీఎస్‌టీ చట్టంలో ప్రతిపాదించారు. కోల్‌కతాలో జరిగిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ సమావేశంలో ఈ నమూనా చట్టానికి ఆమోదం తెలిపారు. వార్షిక టర్నోవర్ రూ.10 లక్షలు దాటిన సంస్థలకు జీఎస్‌టీ అమలవుతుంది. అదే సిక్కిం సహా ఈశాన్య రాష్ట్రాల్లో అయితే రూ.5 లక్షల టర్నోవర్‌కే విధిస్తారు. ఈ నమూనా జీఎస్‌టీ చట్టాన్ని రాష్ట్రాలు సమావేశం ఆమోదించినట్లు రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా వెల్లడించారు