2015

పార్లమెంట్లో రామాలయంపై రగడ..

అయోధ్యలో ఆలయ నిర్మాణ ప్రాంతానికి శిలలు చేరడంపై ప్రతిపక్ష సభ్యులు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఆలయ నిర్మాణం కోసం గుజరాత్‌, రాజస్థాన్‌ల నుండి అయోధ్యకు శిలలు చేరుకుంటున్న విషయాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్‌, ఎస్‌పి, జెడియు సభ్యులు బుధవారం రాజ్యసభలో లేవనెత్తారు. మత ఘర్షణలు రెచ్చగొట్టి ఉత్తరప్రదేశ్‌ను చీల్చేందుకు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు ప్రయత్నిస్తున్నాయంటూ సభ్యులు ధ్వజమెత్తారు. కాగా ఈ ఆరోపణలను ప్రభుత్వం తిరస్కరించింది.

సమైక్యతా సాధనంగా విద్య..

స్వతంత్ర భారత దేశ తొలి విద్యాశాఖా మంత్రి మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ పుట్టిన రోజు నవంబర్‌ 11న జాతీయ విద్యా దినోత్సవంగా పాటించబడుతోంది. 1947 ఆగస్టు 15 నుంచి తాను మరణించిన 1958 ఫిబ్రవరి 22 వరకు పదిన్నర సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన మౌలానా ఆజాద్‌ దేశ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే సమగ్ర విద్యా విధాన రూపకల్పనకు పునాదులు వేశారు. రాజ్యాంగ విలువలతో కూడిన లౌకిక విద్యను అన్ని స్థాయిల్లోనూ అందరికీ సమానంగా అందించేందుకు బహుముఖ పథకాలు, ప్రణాళికలు రచించారు. కామన్‌ స్కూల్‌ సిస్టం, 10+2+3గా విద్యా విధాన చట్రాన్ని నిర్ధారించారు.

బాక్సైట్ జి.వో.నెం. 222నే కాదు.... 97 జి.వో.ను రద్దు చేయాలి. - సిపియం

ఈ రోజు సిపియం ఆఫీసులో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లడుతున్న జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.రమేష్ పాల్గొన్నారు.....

గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వ్యతిరేక పొరాట కమిటీ ఆద్వర్యంలో జరిగిన భహిరంగ సభలో మట్లాడుతున్న సి.పి.ఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రడ్ పి.మధు

ఆపరేషన్ ఆకర్ష్ కు బాబు సిద్ధం..

ఏపీలో చంద్రబాబు ఆపరేషన్‌ ఆకర్ష్‌ ఎప్పుడో మొదలెట్టారు. కాని ఇప్పుడు స్పీడు పెంచారు. ఎవరు అడ్డం పడినా కుదరదని పార్టీ నేతలకు చెప్పేశారు. పలువురు నేతలు కొంత కాలంగా టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నా నెమ్మదిగా ఆచితూచి వ్యవహరించారు బాబు. ఇటీవలే నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం బ్రదర్స్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నా అన్ని ఆలోచించి పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు తాజాగా విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు కొణతాల రామకృష్ణ గండిబాబ్జీలు కూడా సైకిల్ ఎక్కేందుకు రెడీగా ఉన్నారు.కాని మంత్రి గంటాను కొంత కాలంగా ఇబ్బందులకు గురి చేసిన కొణతాలను చేర్చుకోవడంపై పునరాలోచించుకోవాలని బాబుకు సూచించినట్లు తెలుస్తుంది.

భారత ప్రయోజనాలు తాకట్టు:CPM

నైరోబీలో జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ) 10వ మంత్రిత్వ స్థాయి సమావేశం ఫలితం నిరా శ కలిగించడమే కాదు, భారత్‌ ప్రయోజనాలకు పెద్ద దెబ్బ అని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్‌) విమర్శించింది. పార్టీ పొలిట్‌బ్యూరో మంగళవారం నాడు ఈ మేరకు ఒక ప్రకటన విడుదలజేసింది. నైరోబి డబ్ల్యుటివో సమావేశాల్లో మోడీ సర్కార్‌, భారత్‌ ప్రయోజనాలను గాలికొదిలేసిందని వ్యాఖ్యానించింది.

మోడీ రాజీనామాకు కేజ్రి పట్టు ..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ క్రికెట్ సంఘం ఛైర్మన్ గా ఉన్నప్పుడు జరిగిన అవకతవకల గురించి కేజ్రీవాల్ ప్రత్యేక అసెంబ్లీ సెషన్ లో వివరించారు. 2014 లోక్ సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మోడీ నెరవేర్చుకోవడం లేదని, జైట్లీని డీడీసీఏ అవినీతి ఆరోపణల నుండి రక్షించడానికి సీబీఐ దాడులు చేయించి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు కేజ్రీవాల్ ఆరోపించారు.

కోడెలపై YCP అవిశ్వాస తీర్మానం

ఎపి అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై వైసిపి అవిశ్వాస తీర్మాణం అస్త్రాన్ని ప్రయోగించింది. ఈమేరకు వైసిపి సభ్యులు.. అసెంబ్లీ సెక్రటరీకి అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులు అందచేశారు. స్పీకర్‌ కోడెల తమ పట్ల పక్షపాత వైఖరి అనుసరిస్తున్నారంటూ సభ్యులు ఆరోపించారు.

జైట్లీ రాజీనామాపై ఏచూరి..

డిడిసిఎ కుంభకోణంపై గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీని రాజీ నామా చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ సంకేతాలి చ్చారని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. హవాలా కేసులో అద్వానీ చేసినట్లుగా ఇక్కడ జైట్లీ కూడా చేయాలని మోడీ భావిస్తు న్నారని ఏచూరి పేర్కొన్నారు. అద్వానీకి, అరుణ్‌ జైట్లీకి పోలిక తీసుకురావడం ద్వారా జైట్లీ రాజీనామా చేయాలని, తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని నిరూపించుకుని తిరిగి రావాలని ప్రధాని మోడీ ఆయనకు ఒక సంకేతం పంపారని తాను భావిస్తున్నట్లు తెలిపారు.

Pages

Subscribe to RSS - 2015