2015

CPM,CONG పొత్తు ఊహాగానాలే

పశ్చిమబెంగాల్‌లో త్వరలో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్లీనంలో చర్చించలేదని ఏచూరి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలో రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తుందని, దానికి కేంద్ర కమిటీ ఆమోదం తప్పనిసరని చెప్పారు. అయితే బెంగాల్‌ రాష్ట్ర కమిటీ కాంగ్రెస్‌తో పొత్తుకు అనుకూలంగా ఉందన్న మీడియా ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. 'ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమైతే' అన్న విలేకరుల ప్రశ్నకు.. సీపీఎంలో 'ఒకవేళ' అన్న ప్రశ్న ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు..

రాందేవ్‌ ఉపన్యాసం మాకొద్దు..

న్యూఢిల్లీ : జేఎన్‌యూలో వేదాంతపై జరుగుతున్న అంతర్జాతీయ సదస్సుకు యోగా గురు బాబా రాందేవ్‌కు ఆహ్వానం పంపడంపై ఆ యూనివర్సిటీ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు పంపిన ఆహ్వానాన్ని వెనక్కు తీసుకోవాలని లేకుంటే, నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

రామోజీ ఓం సిటీకి వెయ్యి ఎకరాలు

‘ఓం సిటీ’కి తెలంగాణ సర్కారు వెయ్యి ఎకరాల భూమి కేటాయించబోతోంది. ఇందులో ఐదు వందల ఎకరాల వరకూ ప్రభుత్వ భూమి కాగా..మిగిలిన మొత్తం సేకరించి ఇవ్వనుంది. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కొద్ది కాలం క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో సమావేశం అయి..ఓం సిటీ ప్రాజెక్టు గురించి వివరించటంతోపాటు..ప్రాజెక్టుకు సహకరించాల్సిందిగా కోరారు. దీనిపై సీఎం కెసీఆర్ కూడా సానుకూలంగా స్పందించటంతో పాటు..ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

అమోధ్యపై వివాదాస్పద వ్యాఖ్యలు

శివసేన పార్టీ మరోసారి అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే కోర్టులో ఉన్న ఈ అంశంపై స్పందిస్తూ అయోధ్యలో రామమందిర నిర్మాణం జాతీయ కార్యక్రమమని తన అధికార పత్రిక సామ్నాలో తెలిపింది. ఇకనైనా మందిర నిర్మాణం తేదీని ప్రకటించాలని రాముడు గుడారంలాంటి చిన్నపాటి మందిరంలో ఉండటమేంటని ప్రశ్నించింది.

అసభ్యతే AAP ప్రామాణికతా?

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్‌తో సహా ఆప్‌ నేతలపై ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ విరుచుకుపడ్డారు. డీడీసీఏలో అవినీతి జరిగిందంటూ గత కొద్దిరోజులుగా జైట్లీని లక్ష్యంగా చేసుకుని ఆప్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో గురువారం జైట్లీ ఎదురుదాడి చేశారు. 'ఢిల్లీ అసెంబ్లీలో, వెలుపల ప్రధానిని ఇతరులనుద్దేశించి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ చేసిన ప్రకటనలేంటి? భారత ప్రభుత్వ అధికారులెవరైనా అటువంటి భాషను ఉపయోగిస్తారా? ఆ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలించాయి. అధికారంలో వున్నవారు కాస్తంత సంయమనం పాటించాలి. వారు విపరీతంగా వ్యవహరించకూడదు.

రేపు చండీయాగానికి చంద్రబాబు..

మెదక్ జిల్లా తెలంగాణ సీఎం కేసీఆర్ ఫాం హౌస్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అయుత చండీ యాగానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు హాజరు కానున్నారు. రేపు ఉదయం విజయవాడ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో ఎర్రవల్లి చేరుకుని 10 గంటలకు యాగంలో పాల్గొననున్నారు.

పార్టీ బలోపేతమే లక్ష్యంగా సిపిఎం ప్లీనం..

 పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేస్తేగాని పార్టీ అఖిల భారత మహాసభల్లో తీసుకున్న నిర్ణయాలను సాధించలేము. ఆ నిర్ణయాల్లో మొదటిది, పార్టీ స్వతంత్ర బలాన్ని పెంచుకోవడం. దానికి ఆధారంగా వామపక్ష ఐక్యతను పెంపొందించాలి. అలాగే ఇది సాధించేందుకు వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులను కూడగట్టి జాతీయ స్థాయిలో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్‌డి ఎఫ్‌)ను ఏర్పాటు చేయాలి. ఈ లక్ష్యాలను సాధించేందుకు పార్టీ నిర్మాణాన్ని పటిష్టపరచుకోవాలి.

మోదీ లాహోర్‌ పర్యటనపై సీపీఎం..

ప్రధాని లాహోర్‌ పర్యటనను వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలు స్వాగతించాయి. ఇరు దేశాల మధ్య చర్చలు స్థిరంగా, నిరంతరాయంగా కొనసాగాలని సీపీఎం అభిప్రాయపడింది. రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు మెరుగవ్వాలని, ఇదే విద్వేషవాదులకు, ఉగ్రవాదులకు అసలైన విరుగుడు అవుతుందని, పాకిస్తాన్‌ ప్రధానితో తన భేటీకి ఏ అంశాలు ప్రేరణగా నిలిచాయో భారత ప్రధాని జాతికి తెలియజేస్తారని ఆశిస్తున్నామని సీపీఎం అభిప్రాయపడింది..

ఎవరి కోసం అరకు వేడుకలు?:మధు

 గిరిజన ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలతో సహా విద్య, వైద్యం, వ్యవసాయం, తాగునీటి సమస్యలతో పాటు ఎన్నో తీవ్రమైన సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించకుండా కాంట్రాక్టర్లను సంతృప్తి పర్చేందుకు, గొప్పల కోసం అరకు ఉత్సవాలను నిర్వహించడం సరికాదని సిపిఎం తప్పుపట్టింది. ఉత్సవాల నిర్వహణపై ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతున్న గిరిజన ప్రజలు, నాయకులను పోలీసులు విచక్షణ రహితంగా ఈడ్చివేస్తూ అరెస్టు చేయ టాన్ని సిపిఎం రాష్ట్ర కార్య దర్శి పి.మధు తీవ్రంగా ఖండించారు..

నేడే కలకత్తాలోCPM పార్టీప్లీనం

1964లో సిపిఎం ఏర్పడిన తర్వాత చారిత్రాత్మక బర్ద్వాన్‌ ప్లీనం జరిగింది. మళ్లీ 37 ఏళ్ల క్రితం హౌరా జిల్లాలోని సాల్కియాలో ప్లీనం జరిగింది. సిపిఎం అవిర్భావం తర్వాత పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు మూడో ప్లీనం కోల్‌ కతాలో డిసెంబర్‌ 27 నుంచి 31 వరకు జరగబోతోంది. 

Pages

Subscribe to RSS - 2015