2015

భారత పత్రికారంగం భవిష్యత్తేమిటి?

             అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలలో వార్తా పత్రికారంగం చూస్తుండగానే సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ డిజిటల్‌ యుగంలో బాగా అభివృద్ధి చెందిన దేశాలలోని వార్తా పత్రికలూ, సమాచార టెలివిజన్ల భవితవ్యంపై విషాదం అలముకుంది. వ్యాన్‌ ఇఫ్రా ఆధ్వర్యంలో అక్టోబర్‌ 2011న వియన్నాలో నిర్వహించిన ప్రపంచ వార్తా పత్రికల మహాసభ, ప్రపంచ సంపాదకుల ఫోరంలలో నేనూ పాల్గొన్నాను. ఆ సమావేశాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిలోనూ వార్తా పత్రికారంగ చారిత్రక యుగం ముగింపు కొచ్చిందని, ప్రపంచవ్యాప్తంగా అటూ ఇటూగా అందరం నిలకడలేని అనిశ్చితిలోకి అడుగుపెడు తున్నామన్న భావన కలిగింది.

రాజకీయ దురహంకారం..

         మనం ఏ సంస్కృతిలో జీవిస్తున్నాం? ఏ అహంకారాల అభిజాత్యాల జాతరలో కొట్టుకుపోతున్నాం? మనం చూస్తున్నదంతా నిజమేనా? సత్యం కానిదాన్ని సత్యంగా.. సత్యాన్ని అబద్ధంగా అర్థం చేసుకుంటూ అంతా రివర్స్‌ గేర్‌లో నడుస్తున్నామా? రేవంత్‌ మహాశయుడు జైలు నుంచి బెయిల్‌ మీద తిరిగి వచ్చిన సంరంభం చూస్తే ఇప్పుడు ఏ కాలుష్యంలో మనం ఊపిరి పీల్చుకుంటున్నామో బోధపడక చాలా తికమకపడతాం. నిజమే గాంధీజీలాంటి మహానుభావుల, బుద్ధుడు, క్రీస్తులాంటి వారి పునరుత్థానం కూడా జనంలో ఇంత ఆనందాతిశయాన్ని రేకెత్తిస్తుందో, లేదో అనుమానమే. జైలు నుంచి మన నాయకుల పునరుత్థానం మాత్రం అదో అండపిండ బ్రహ్మాండ మహోత్సవంగా మారిపోయింది. పునరపి జైలు..

ఎన్‌డిఎ ప్రభుత్వం - త్రిముఖ ప్రమాదాలు

భారతదేశ జాతీయవాదానికి మత భిన్నత్వంతో సహా తమ బహుళ విధమైన భిన్నత్వాన్ని గౌరవించే విస్తారమైన ప్రజలను కలుపుకుపోవడం కీలకంగా ఉంటుంది. అలా కలుపుకుపోవడమనేది 'భారతదేశ భావన'కు అంటే లౌకిక ప్రజాస్వామ్యానికి కేంద్రకంగా ఉంటుంది. ఇక్కడ లౌకికవాదం, ప్రజాస్వామ్యాలను రెండు భిన్నమైన భావనలంటూ వేరు చేయజాలం. కానీ నేడు ఆర్‌ఎస్‌ఎస్‌/బిజెపి ఈ రకంగా విడదీస్తున్నాయి. మన లౌకిక ప్రజాతంత్ర గణతంత్ర రాజ్యాన్ని ఏమాత్రం సహనం లేని ఫాసిస్టు 'హిందూ రాజ్యంగా' మార్చాలనే తమ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవడం ద్వారా అవి విడదీస్తున్నాయి.

పడకేసిన ప్రాథమిక వైద్యం

                   మా బంధువు ఒకరు ఛాతిలో మంట ఉందని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్ళారు. వెంటనే ఎండోస్కోపీ, రక్తపరీక్షలు చేస్తేనే జబ్బు ఏంటో తెలుస్తుందని భయపెట్టి డాక్టర్‌ అన్ని రకాల పరీక్షలూ చేశారు. 15 రోజులకు రూ.2,200 విలువ చేసే మందులు సహా రూ.7,500 వసూలు చేశారు. అదే వ్యక్తిని కొన్నాళ్ళ తర్వాత నాకు తెలిసిన డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్తే గ్యాస్‌ సమస్య ఉందని, కారం, మసాలాలు తగ్గించమని చెప్పి ఒక ట్యాబ్లెట్‌తోపాటు, మంట ఉన్నప్పుడు డైజిన్‌ మాత్ర చప్పరిస్తే సరిపోతుందని చెప్పారు. దీనికి కేవలం రూ.10 మాత్రమే ఖర్చయింది. మన రాష్ట్రంలో ప్రజలను ప్రైవేట్‌ వైద్యశాలలు ఎలా పీల్చి పిప్పి చేస్తున్నాయో అర్థమవుతుంది.

" అవినీతి - కార్పొరేట్ రాజకీయాలు - ప్రత్యామ్న్యాయం " సదస్సు

30-06-2015 సాయంత్రం 6 గం।। లకు 

హనుమంతరాయ గ్రంధాలయం ,గాంధీనగర్ ,విజయవాడ 

ముఖ్య అతిధి : బివి రాఘవులు 

హిందూ తీవ్రవాదులపై మెతక వైఖరి

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృ త్వంలోని ఎన్డీయే సర్కార్‌ మెడకు మరో వివాదం చుట్టుకుంది. 2008 నాటి మాలేగావ్‌ పేలుళ్ల కేసులో నిందితులుగాఉన్న హిందూ తీవ్రవాదుల పట్ల మెతక వైఖరి అనుసరించాలని జాతీయ భద్రత సంస్థ (ఎన్‌ఐఎ) ఒత్తిడి తీసుకొ చ్చినట్లు ఈ కేసులో స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూ టర్‌గా ఉన్న రోహిణి శాలియన్‌ చెప్పారు. ఈ పేలుళ్లలో ఆరుగురు మరణించగా మరో 70 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. మోడీ సర్కార్‌ అధికార పగ్గాలను చేపట్టిన నాటి నుండే హిందూ తీవ్రవాదులపై మెతక వైఖరి అనుసరించాలన్న ఆదేశాలు ఎన్‌ఐఎ నుంచి పెరిగాయని ఆమె తెలిపారు.

Pages

Subscribe to RSS - 2015