పార్లమెంట్లో రామాలయంపై రగడ..

అయోధ్యలో ఆలయ నిర్మాణ ప్రాంతానికి శిలలు చేరడంపై ప్రతిపక్ష సభ్యులు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఆలయ నిర్మాణం కోసం గుజరాత్‌, రాజస్థాన్‌ల నుండి అయోధ్యకు శిలలు చేరుకుంటున్న విషయాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్‌, ఎస్‌పి, జెడియు సభ్యులు బుధవారం రాజ్యసభలో లేవనెత్తారు. మత ఘర్షణలు రెచ్చగొట్టి ఉత్తరప్రదేశ్‌ను చీల్చేందుకు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు ప్రయత్నిస్తున్నాయంటూ సభ్యులు ధ్వజమెత్తారు. కాగా ఈ ఆరోపణలను ప్రభుత్వం తిరస్కరించింది.