భారత ప్రయోజనాలు తాకట్టు:CPM

నైరోబీలో జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ) 10వ మంత్రిత్వ స్థాయి సమావేశం ఫలితం నిరా శ కలిగించడమే కాదు, భారత్‌ ప్రయోజనాలకు పెద్ద దెబ్బ అని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్‌) విమర్శించింది. పార్టీ పొలిట్‌బ్యూరో మంగళవారం నాడు ఈ మేరకు ఒక ప్రకటన విడుదలజేసింది. నైరోబి డబ్ల్యుటివో సమావేశాల్లో మోడీ సర్కార్‌, భారత్‌ ప్రయోజనాలను గాలికొదిలేసిందని వ్యాఖ్యానించింది. లక్షలాదిమంది భారతీయుల ఆకలి అవస రాలను తీర్చడానికి కీలకమైన ఆహార భద్రతకు గానూ పబ్లిక్‌ స్టాక్‌ హోల్డింగ్‌ (ఆహార ధాన్యాల నిల్వల) సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొనవచ్చనే ఉద్దేశంతో భారత్‌ డబ్ల్యుటిఓ చర్చలకు వెళ్ళిందని, కానీ ఫలితం మరోలా వుందని పొలిట్‌ బ్యూరో పేర్కొంది.