రాజధాని అమరావతి శంకుస్థాపనకు సర్వం సిద్ధమైంది. ప్రచారహోరు ఉధృతంగా ఉంది. మీడియా రాజధానిపైనే కేంద్రీకరించింది. ప్రభుత్వ పెద్దలు, తెలుగుదేశం నేతలు, అధికార యంత్రాంగమంతా నీరు-మట్టి, 5కె రన్ పేర్లతో హడావుడి చేస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ సహా ప్రముఖ నేతలు, సెలబ్రిటీలు శంకుస్థాపనకు హాజరు కాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. సందడి నెలకొన్నది. వందల కోట్ల రూపాయలు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారు. ఆహ్వానపత్రిక మొదలు వంటకాల వరకు అన్నీ ప్రచార అంశాలుగా మార్చేశారు. ఈ నేపథ్యంలో రాజధాని గురించే సర్వత్రా చర్చ నెలకొన్నది.