దళిత చిన్నారుల సజీవదహనం..

ఫ్యూడలిస్టు సంస్కృతి పాతుకుపోయిన హర్యానాలో కుల రక్కసి కోరలు చాచింది. అన్పెం పున్నెం ఎరుగని ఇద్దరు పసి పిల్లలను అగ్నికీలలకు ఆహుతిచ్చింది. దేశ రాజధానికి 40 కిలోమీటర్ల దూరంలోని సోన్‌దీప్‌ గ్రామం (హర్యానా)లో సోమవారం ఈ దారుణం చోటుచేసుకుంది. అగ్రవర్ణ దురహంకారం తలకెక్కిన ఠాకూర్‌ కులస్థులు కొందరు ఓ దళితుని ఇంటికి అర్ధరాత్రిపూట నిప్పంటించారు. ఆ మంటల్లో చిక్కుకుని ఇద్దరు పిల్లలు కాలి బూడిదయ్యారు. తల్లిదండ్రులు గాయాలతో బయటపడ్డారు. బూఠాకూర్‌ కులస్థులే తన ఇంటిపై రాత్రి రెండు గంట ప్రాంతంలో దాడి చేశారని ఆ పిల్లల తండ్రి జితేందర్‌ తెలిపారు