భారత్ ''భిన్నత్వంలో ఏకత్వం'' ఉన్న దేశం. మన గొప్పతనానికి, ప్రజల ప్రశాంత జీవనానికి అదే కారణం. భిన్న కులాలు, మతాలు, జాతులు, సంస్కతుల మధ్య భాసిల్లిన భారతీయతకు ఇప్పుడు భంగం వాటిల్లింది. ''రాజ్యాంగమెంత మంచిదైనా పాలకులు మంచివారు కాక పోతే అది చెడుగా మారు తుంది. ఎంత చెడు రాజ్యాంగమైనా పాలకులు మంచి వారైతే మంచిదిగా మారుతుంది'' అని డాక్టర్ అంబేద్కర్ హెచ్చరించారు. రాజ్యాంగం ప్రకారం భారత దేశం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం. లౌకికవాదానికి నిఘంటువులు ''ఈ భౌతిక ప్రపంచానికి చెందిన, ఆధ్యాత్మికం కాని, మతాతీతమైన'' అనే అర్థాలనిచ్చాయి.