2015

అవాజ్‌ రాష్ట్ర మహాసభలు..

మంచి రోజులు తీసుకొస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన బిజెపి, అధికారంలోకి వచ్చాక పెట్టుబడిదారులకు మాత్రమే మంచి రోజులు తీసుకొచ్చేలా వ్యవహరిస్తోందని జమ్మూ కాశ్మీర్‌ శాసనసభలో సిపిఎం పక్ష నేత యూసుఫ్‌ తరగామి స్పష్టం చేశారు. అవాజ్‌ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆదివారం అనంతపురంలో బహిరంగ సభను నిర్వహించారు. సభలో తరగామి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు 'అచ్చేదిన్‌ ఆయేంగే' అంటూ ప్రచారాన్ని పెద్దఎత్తున బిజెపి చేపట్టిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రజలను విస్మరించి బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. 

భూములను కార్పొరేట్లకు కట్టబెట్టొద్దు..

రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం చట్టాలను అపహాస్యం చేస్తూ అడ్డగోలుగా సాగు భూములను సేకరిస్తే ప్రతిఘటన తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా భూ నిర్వాసితుల సమస్యలపై చర్చించేందుకు ఈనెల 30న విజయవాడలో రాష్ట్రస్థాయి రైతు సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదివారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు, గడివేముల మండలాల్లో ప్రయివేటు కంపెనీలకు అప్పగించిన భూములను పరిశీలించిన అనంతరం సిపిఎం కర్నూలు జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ బ్యాంకు పేరుతో భూములను సేకరించడం తగదన్నారు. కలెక్టర్లపై విచారణ చేపడితే రెవెన్యూ కుంభకోణం బయటపడుతుందని చెప్పారు.

మరో దాద్రి ఘటన..

 సిమ్లా: దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న దాద్రి ఘటన ఇంకా ప్రజల స్మృతిపధంలో నుంచి తొలగక ముందే, అదే తరహా సంఘటన మరొకటి చోటుచేసుకుంది. ఈ సారి హిమాచల్‌ప్రదేశ్‌ దీనికి వేదికైంది. ఆవులను అక్రమంగా తరలిస్తున్నాడనే నెపంతో ఓ ట్రక్కు డ్రైవర్‌ని బజరంగదళ్‌ కార్యకర్తలుగా అను మానిస్తున్న దుండగులు కొట్టి చంపేశారు. 

గో మాంసంపై వివాదాస్పద వ్యాఖ్యలు

ముస్లింలు దేశంలో నివసించాలంటే ఆవు మాంసం తినడం మానుకోవాల్సిందేనని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై దేశంలోని పలు సంఘాలు, రాజకీయ నేతల నుంచి పెద్దయెత్తున విమర్శలు ఎదురవుతున్నాయి. ఖట్టర్‌ వాఖ్యలపై ముస్లింలు ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) శుక్రవారం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి విజ్ఞప్తి చేసింది. భారతదేశం ఒక్క ఖట్టర్‌దే కాదని, ఈ దేశం ఆయనకెలాంటిదో, ప్రతి ముస్లింకు అలాంటిదేనని ఎన్‌సిపి అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ ముంబయిలో విలేకరులతో అన్నారు.

కోల్‌కతాలో లెఫ్ట్ భారీ ర్యాలీ..

సామ్రాజ్యవాదాన్నీ, మతతత్వాన్నీ అంతమొందిస్తామని నినదిస్తూ కోల్‌కతా వీధుల్లో వేలాది మంది కదం తొక్కారు. దాద్రీ సంఘటన, పాలస్తీనా అంశంపై మారిన భారత విదేశాంగ వైఖరి నేపథ్యంలో 6 వామపక్ష పార్టీలు శుక్రవారం ర్యాలీ నిర్వహించాయి. ఎర్రజెండాలు, ప్లకార్డులతో ర్యాలీలో పాల్గొన్న జనసందోహంతో కోల్‌కతా ఎర్రబారింది. నగరం మధ్యలో ఉన్న ఎస్‌ప్లనేడ్‌లోని వై చానల్‌ వద్ద ప్రారంభమైన ర్యాలీ ఉత్తర కోల్‌కతాలోని కాలేజ్‌ స్క్వేర్‌ దాకా కొనసాగింది. ఈ ర్యాలీలో ముందు నిలబడ్డవారిలో పశ్చిమ బెంగాల్‌ లెఫ్ట్‌ ఫ్రంట్‌ చైర్మన్‌ బిమన్‌ బసు, సౌమెన్‌ బసు (ఎస్‌యుసిఐ), పార్థో ఘోష్‌ (సిపిఐ-ఎంఎల్‌) తదితరులున్నారు.

అమరావతి రోడ్డుపై రాస్తారోకో..

అర్హులైనవారందరికీ ప్రభుత్వం ప్రకటించిన భూమిలేని నిరుపేదలకు ఇస్తానన్న రూ.2500లు పింఛన్‌ ఇవ్వాలని డిమాండ్‌చేస్తూ శుక్రవారం నిడమర్రులోని సిఆర్‌డిఎ కార్యాలయాన్ని సిపిఎం ఆధ్వర్యంలో పేదలు పెద్దఎత్తున ముట్టడించారు. వందలాదిమంది కార్యాలయం ఆవరణలోకి జొరబడి పెద్దఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. అర్హులను కాదని అనర్హులకు పింఛన్లు కట్టబెడుతున్నారని బాధితులు ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. జన్మభూమి కమిటీ పేరుతో పచ్చచొక్కాల కార్యకర్తల ప్రమేయం పెరగడం వలనే అనర్హులకు అందలాలు అందుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

వ్యవసాయంతో బ్యాంకుల దోబూచులాట

నేటి వ్యవసాయ రంగంలో కొనసాగుతున్న మాంద్యానికి పెట్టు బడులు ప్రధాన కారణం. 1965-85 మధ్య బ్యాంకింగ్‌ రంగం వ్యవ సాయ రంగానికి పూర్తి సహాయ సహకారాలు అందించింది. ఫలితం గా, ఉత్పత్తి, ఉత్పాదకత ఆహార ధాన్యాలలో ఐదు రెట్లు పెరిగింది. పెరిగిన జనాభాకు తగి నంత ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసుకోగలి గాం. ఆహార ధాన్యాలలోనే కాక పప్పులు, నూనెగింజలు, తదితర పంటల్లో కూడా స్వయంపోషకత్వం సాధించాం. 1969లో 17 బ్యాంకులను జాతీయం చేశారు. 1980లో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండి యా, విజయ బ్యాంకును జాతీయం చేశారు. జాతీయం చేయడంతో బ్యాంకులు వ్యవసాయ రంగానికి తగినంత రుణ సౌకర్యం కల్పించాయి.

అప్పుల ఆడంబరం..

ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత సామెత రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి నప్పుతుంది. పూట గడిస్తే చాలన్నట్లు విత్త సమస్య అఘోరిస్తున్నా సర్కారు అట్టహాసాలకు ఆడంబరాలకు తక్కువేం లేదు. మొన్న గోదావరి పుష్కరాలు నిన్న నదుల అనుసంధానం నేడు అమరావతి శంకుస్థాపన హద్దు మీరిన ప్రభుత్వ ప్రచార పటాటోపానికి మచ్చు తునకలు. అమరావతి భూమి పూజ, సంకల్ప దీక్ష వగైరా వగైరా ఉండనే ఉన్నాయి. నీరు-చెట్టు, రైతు భరోసా, స్వచ్ఛ భారత్‌ వంటి అనేకానేక ఆర్భాట కార్యక్రమాలకు కొదవే లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అని పిలిపించుకోవడం ఇష్టం. ఈవెంట్‌ మేనేజర్‌ అంటే మరీ ఇష్టం.

దళిత MROపై VHPదాడి

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్‌ మండలంలోని పిడింగొయ్యిలోని వివాదాస్పద భూమిలో ఆలయ ప్రవేశానికి అవకాశం కల్పించా లంటూ విశ్వహిందూ పరిషత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి నాయకులు, స్థానిక పెత్తందార్లతో కలిసి గురువారం రూరల్‌ తహశీల్దార్‌ జి.భీమారావుపై దాడికి తెగబడ్డారు. దీంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాజమండ్రిలోని ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు. 

Pages

Subscribe to RSS - 2015