2015

ఫాసిస్టు దాడి..

ముంబయిలో రచయిత సుధీంద్ర కులకర్ణిపై శివసేన మూకలు చేసిన దాడి సభ్య సమాజం వేనోళ్ల ఖండించాల్సిన దుర్మార్గ చర్య. మన దేశంలో మతోన్మాద శక్తులు అధికార పీఠాన్ని అధిరోహించిన తరువాత భావ ప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న దాడుల పరంపరలో ఇది తాజాది. పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఖుర్షీద్‌ మహ్మద్‌ కసూరి పుస్తకావిష్కరణ సందర్భంగా ఫాసిస్టు మూకలు రెచ్చిపోయి కులకర్ణిపై నల్ల పెయింట్‌తో జరిపిన దాడి మేధో జగత్తును విస్మయానికి గురిచేసింది. కేంద్ర ప్రభుత్వంలోను, మహా రాష్ట్ర ప్రభుత్వంలోను బిజెపికి భాగస్వామిగా వున్న శివసేన విద్వేషపూరిత రాజకీయాలకు పేరుమోసింది.

హుదూద్‌ వంచన..

 ఉత్తరాంధ్ర, ప్రధానంగా విశాఖ నగర రూపురేఖలను చిన్నాభిన్నం చేసిన హుదూద్‌ విలయం సంభవించి సరిగ్గా ఏడాది. ఆ ప్రచండ తుపాను ప్రాంతాల పునర్నిర్మాణం, బాధితుల సహాయ, పునరావాసాలపై నాడు ప్రభుత్వం గుప్పించిన హామీలపై వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. కంటి తుడుపు చర్యలు, ప్రచార్భాటం తప్ప ఒక్క పటిష్ట, శాశ్వత చర్య లేదుగాక లేదు. వినాశనం నుంచి ప్రజలు స్వంతంగా శక్తినంతా కూడదీసుకొని కుదుట పడ్డారు మినహా ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ పరిపాలనా దక్షత, కొండంత మనసు వలన హుదూద్‌ బాధితుల జీవితాల్లో కాంతులు విరజిమ్మాయంటున్న అనుకూల మీడియా కథనాలు వంచనా శిల్పాలు.

ఇక ప్రత్యక్ష భూ పోరాటం..

వామపక్ష, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలన్నీ ప్రత్యక్ష భూ పోరాటాలకు సన్నద్ధం కావాలని ఎపి రైతు సంఘం ప్రధాన కార్యదర్శి వంగల సుబ్బారావు పిలుపునిచ్చారు. ఇందుకు అన్ని సంఘాలతో భూ హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 29న విజయవాడలో రాష్ట్ర స్థాయి భూ సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఇక్కడ దాసరి భవన్‌లో వామ పక్ష రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవడాన్ని ఖండించారు.

MLC శర్మ మౌన దీక్ష

విశాఖ జిల్లా గ్రంథాలయ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భవన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ డిమాండ్‌చేశారు. ఈ మేరకు మంగళవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఒక రోజు మౌనదీక్ష చేపట్టారు. ఎయు మాజీ వీసీ ప్రొఫెసర్‌ కెవి రమణ దీక్షను ప్రారంభించగా, పౌర గ్రంథాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు బిఎల్‌ నారాయణ అధ్యక్షత వహించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ సాగిన దీక్షను పలువురు ప్రముఖులు సందర్శించి సంఘీభావం తెలిపారు.

CPMపై అక్కసుతో తప్పుడు రాతలా?

సీనియర్‌ పాత్రికేయులు, ప్రస్తుత బిజెపి అధికార ప్రతినిధి, ఎంపీ ఎంజె అక్బర్‌ ఆక్టోబరు 5న వృద్ధ నేతలు-వ్యర్థ సిద్దాంతాల పేరుతో సాక్షి దినపత్రికలో వ్యాసం రాశారు. సీనియర్‌ పాత్రికేయులుగా సమకాలీన రాజకీయాల్లో విశ్లేషణా త్మక విమర్శలు చేసి ఉంటే మంచిది. కానీ అందుకు విరుద్ధంగా తమ పార్టీ సహజ లక్షణాలు పుణికి పుచ్చుకుని కమ్యూనిజంపై ముఖ్యంగా మార్కిస్టు పార్టీపై కూడా విమర్శలకు దిగారు.

పేదల ఇళ్ళ పట్టాలకై ఆందోళన..

సంఘటితంగా ఉద్య మించి ఇళ్ల పట్టాలు, రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం సాధించుకోవాలని, లేకపోతే ఈ ప్రభుత్వం ఉన్న గూడును కూడా ఉండనిచ్చే పరిస్థితి లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు పేర్కొన్నారు. ఎన్నికల వాగ్దానం మేరకు కృష్ణాకరకట్ట నివాసుల పరిరక్షణకై రిటైనింగ్‌వాల్‌ నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో రామలింగేశ్వర్‌నగర్‌లోని తారకరామా నగర్‌, ఇతర ప్రాంతాల్లో సోమవారం పాదయాత్ర చేశారు. బాబూరావు మాట్లాడుతూ సుందరీకరణ పేరుతో కృష్ణాకరకట్ట పరివాహక ప్రాంత పరిధిలోని 8.5 కిలోమీటర్ల పరిధిలో పేదలు నివాసాలుండే గృహాలను తొలగించాలన్న ప్రభుత్వం యోచనను అందరూ సంఘటితంగా తిప్పికొట్టాలని కోరారు.

మోడీ మౌనంపై కలాల తిరుగుబాటు

తమ సాహిత్య అకాడమీ అవార్డులను వెనక్కి ఇవ్వడం ద్వారా ప్రముఖ రచయితలు నయనతార సెహగల్‌, అశోక్‌ వాజ్‌పేయి ప్రధాని మోడీ విస్మరించిన రెండు విధులను, బాధ్యతలను గుర్తు చేశారు. ఈ దేశంలో ఒక పౌరునికున్న జీవించే హక్కును పరిరక్షించడం, సృజనాత్మకతకు సంబంధించి కళాకారునికి గల హక్కును పరిరక్షించడం. దేశంలో ఇంత జరుగుతున్నా తమ సహ రచయితలు, సాహిత్య సంస్థలు మౌనం పాటించడం పట్ల కూడా వారు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో ప్రత్యేకించి ఒక అన్యాయం జరుగుతుంటే దాన్ని మాత్రమే సంస్కరించాలని రచయిత భావించరాదు. అవసరమైతే నాగరికతా స్ఫూర్తికి సంబంధించి హెచ్చరికల సంకేతాలు కూడా పంపించాలి.

ప్రైవేటు రిజర్వేషన్లకై పోరాటం..

ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్‌లో చట్టం చేయాలని రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు డిమాండ్‌ చేశారు. ' ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్ల అమలుకు పార్లమెంటులో చట్టం ' అనే అంశంపై కెవిపిఎస్‌ ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని సోమవారం నిర్వహించింది. కెవిపిఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు అధ్యక్షత వహిం చారు. ఈ సమావేశంలో కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ అగ్రవర్ణ కులాల పెత్తందార్లు తామూ పేదలమేనని, తమకూ రిజర్వేషన్లు కల్పించాలని, లేదంటే ఉన్న రిజర్వేషన్లను తొలగించాలని విష పూరిత ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజధాని పనులను నిలిపివేయండి:NGT

పర్యావరణ అనుమతులు లేని కారణంగా రాజధాని పనులను నిలిపివేయాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి) ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వు లను రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. తోటలను కూల్చివేయడం, పొలాలను చదును చేయడం, శంకుస్థాపన పేరిట తాత్కాలిక నిర్మాణా లను చేపట్టడం వంటి పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర మంత్రులతో పాటు, ఉన్నతస్థాయి అధికారులు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎన్‌జిటి ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తుండటం పట్ల పర్యావరణ వేత్తల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సర్కారుపై ధిక్కార కేసును దాఖలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ దిశలో అవసరమైన ఆధారాలను ఇప్పటికే సేకరించారు.

విద్యపై నిర్లక్ష్యం:MLCశర్మ

విజయవాడ మాంటిస్సోరి కళాశాల ఆడిటోరియంలో ఈనెల 12, 13 తేదీల్లో రెండు రోజులపాటు మహిళా టీచర్ల రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా ఇచ్చిన ప్రాథమిక విద్యనే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక విద్య కోసం అదనంగా రూ.80 వేల కోట్లు ఖర్చు చేయాలని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ ( ఎన్‌సిఇఆర్‌టి ) చెప్పినా, ప్రభుత్వం అందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం రాజ్యాంగ స్పూర్తితో కాకుండా, వ్యాపార దృష్టితో విద్యను అందిస్తోందన్నారు.

Pages

Subscribe to RSS - 2015