2015

UPలోదళితపై పోలీసుల దాష్టీకం...

తమ ఇంట్లో దొంగతనం జరిగింది.. తమకు న్యాయం చేయండి అని పీఎస్ కు వెళ్లిన అని ఓ దళిత కుటుంబంతో పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారు. స్టేషన్ బైటికి గుంజుకొచ్చి నడి రోడ్డు మీద భార్య భర్తల బట్టలు ఊడదీసి కొట్టారు. ఉత్తరప్రదేశ్ లోని దన్ కౌర్ పోలీసు స్టేషన్ పరిదిలో జరిగింది. సునీల్ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదును స్టేషన్ లో ఉన్న స్టేషన్ ఆఫీసర్ ప్రవీణ్ యాదవ్ కేసు నమోదు చేయడానికి నిరాకరించాడు. దాంతో ఎందుకు కేసు నమోదు చేయరో చెప్పాలని సునీల్ కుటుంభం ప్రవీణ్ ను నిలదీసింది. అంతే.... పోలీసు అధికారి ప్రవీణ్ కు కోపమొచ్చింది. ఆగ్రహంతో ఊగిపోయాడు. అతనికి స్టేషన్ లో ఉన్న మరికొందరు పోలీసులు తోడయ్యారు.

విభజనపై ఆరా తీయండి:ఉండవల్లి

రాజ్యాంగం, పార్లమెంట్ నియమ నిబంధనలకు లోబడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఉభయ సభల ఆమోదం పొందిందా? లేదా? అన్న విషయమై సమగ్రమైన ఆరాతీసి జరిగిన నష్టాన్ని సరిదిద్దాలని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేశారు. 2014 ఫిబ్రవరి 18న ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తీరును కూలంకషంగా పరిశీలిస్తే బిల్లు చట్టసభల అనుమతి పొందలేదని ధ్రువపడుతుందని ఆయన చెప్పారు. 

ఆధార్‌పై సుప్రీం నిర్ణయం..

ప్రజాపంపిణీ వ్యవస్థ, వంటగ్యాస్‌లకు మాత్రమే ఆధార్‌ వినియోగాన్ని పరిమితం చేస్తూ గతంలో జారీ చేసిన ఆదేశాలను సవరించడానికి విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాలన్న పిటిషన్‌పై శుక్రవారం సాయంత్రంలోపు నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టు గురువారం కేంద్రానికి, సెబీ, ఆర్‌బిఐ తదితర సంస్థలకు హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని విచారిస్తున్న సుప్రీం బెంచ్‌కు నేతృత్వం వహిస్తోన్న ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్‌ దత్తు మాట్లాడుతూ తనకు శుక్రవారం సాయంత్రం వరకు సమయం ఇవ్వండి. అప్పటిలోగా తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

గోవధ అంశంపై ముస్లింనేతపై దాడి

జమ్మూ కాశ్మీర్ : ఇండిపెండెంట్ ఎమ్మెల్యే షేక్ అబ్దుల్ రషీద్ పై అధికార కూటమిలోని బీజేపీ సభ్యులు మూకుమ్మడిగా దాడి చేశారు.శ్రీనగర్ ఎమ్మెల్యేల హాస్టల్ లో రషీద్ కొందరికీ 'బీఫ్' పార్టీ ఇచ్చారనే ఆరోపణలున్నాయి. గో మాంసంపై నిషేధం అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఇటీవలే ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై రషీద్ పలు వ్యాఖ్యాలు చేశారని వార్తలు వచ్చాయి. దీనికి ఆగ్రహానికి గురైన కాషాయ దళం ఆయనపై దాడికి దిగారు. 

కలం యోధుల కలత..

పెచ్చుమీరుతున్న మతతత్వ శక్తుల ఆగడాలపై కలం యోధులు కలత చెందుతున్నారు. కేంద్రం ప్రకటించిన అరుదైన పురస్కారాలను సైతం తిప్పి పంపుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిన్న నయన తార సెహెగల్‌ కేంద్ర సాహిత్య అకాడమి అవార్డును వెనక్కి పంపగా మరో కవి అశోక్‌ వాజ్‌పేయి కూడా అదే బాటను ఎంచుకున్నారు.

IMF పెదవి విరుపు..

భారత్ ఆర్థిక వృద్ధిరేటు ఆసక్తికరంగానే ఉన్నా.. సంస్కరణల అమలుపై ఐఎంఎఫ్ మరోసారి పెదవి విరిచింది. కీలక రంగాల్లో ఆశించిన స్థాయిలో సంస్కరణలు అమలు జరగటం లేదని పేర్కొంది. ఈ ఏడాది వృద్ధిరేటును కూడా గత అంచనా కంటే స్వల్పంగా తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటుపై ఐఎంఎఫ్ తాజా నివేదిక విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా కనిపిస్తున్నా.. సంస్కరణలు అమలు ఆశించిన స్థాయిలో లేదని పేర్కొంది. ముఖ్యంగా నిర్మాణ రంగాల్లో కీలకమైన ఎనర్జీ, మైనింగ్, విద్యుత్ రంగాల్లో రీఫామ్స్ సరిగా జరగడం లేదని పెదవి విరిచింది.

ప్రజా చైతన్యయాత్రలో ఉద్రిక్తత

 'రాజధాని ప్రజా చైతన్య యాత్ర'ను పోలీసులు అడ్డుకున్నారు.పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంపై రాజధాని ప్రాంత సీపీఎం కమిటీ కన్వీనర్ సీ.హెచ్.బాబురావు తీవ్రంగా తప్పుబట్టారు. తాము ఎం తప్పు చేశామని పోలీసులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా టెన్ టివితో ఆయన మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఇక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని తాము డిమాండ్ చేయడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా తాము పాదయాత్ర చేపట్టినట్లు ఇక్కడ ఉన్న కౌలు రౌతుల పరిస్తితి ఏంటీ ? రూ.2500 పెన్షన్ ఎలా సరిపోతుంది అని ప్రశ్నించారు.

రాజధాని రైతుల సమస్యలపై పోరు

సిపిఎం చేపట్టిన 'రాజధాని ప్రజా చైతన్య యాత్ర'కు  పోలీసులు అడ్డు తగిలారు. తుళ్లూరు ప్రాంతంలో చేపట్టిన పాదయాత్రకు అనుమతి లేదంటూ సీపీఎం నేతలను అరెస్టు చేశారు.ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు..పేదలకు ఎలాంటి పాట్లు పడుతున్నారో కళ్లకు కట్టినట్లుగా కళారూపాలు ప్రదర్శించారు. పాదయాత్రలో పేదలు..ఇతరులు..వామపక్ష నేతలు భారీగా హాజరయ్యారు. కొద్దిసేపు ముందుకు సాగిన అనంతరం పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా చేస్తున్న యాత్రకు ఎందుకు అడ్డుతగులుతున్నారని వామపక్ష నేతలు ప్రశ్నించారు. పోలీసులను దాటుకుని నేతలు ముందుకెళ్లారు.

Pages

Subscribe to RSS - 2015