కార్మిక సంఘాలను, కార్మికుల న్యాయమైన కోర్కెలకు మద్దతిచ్చే పార్టీలను, సంస్థలను ఉక్కుపాదంతో అణచి వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల విశాఖపట్నంలో చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గపూరితమైనవి. రాష్ట్ర ప్రభుత్వాధిపతిగా కార్మికుల హక్కులను పరిరక్షించాల్సింది పోయి యాజమాన్యాల దోపిడీకి వకాల్తా పుచ్చుకోవడం దారుణం. ట్రేడ్ యూనియన్లపై విషం కక్కిన బాబు తమ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, పెట్టుబడిదారుల అనుకూలమని కుండబద్దలు కొట్టారు. పారిశ్రామిక అభివృద్ధికి కార్మిక సంఘాలు అడ్డంకిగా మారాయని స్వయంగా ముఖ్యమంత్రే వక్కాణించడం అక్కసును తెలుపుతుంది. యూనియన్లు పరిశ్రమల ఉనికికే ప్రమాదంగా మారాయనడం వాక్‌చాపల్యమే.