అయిదేళ్లలో పరిశుభ్ర భారతావని సాధించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీక్షబూని ఏడాది గడుస్తున్న సందర్భంగా మళ్లీ చీపురు కట్టలు పట్టుకుని రాజకీయ నాయకులు, సినీ, సామాజిక రంగ ప్రముఖలు టివీల్లో కనిపిస్తున్నారు. ఏడాది క్రితం ఇదే సీజన్‌లో మనకు ఇవే దృశ్యాలు కనిపించాయి. ఈ మధ్య కాలంలో స్వచ్ఛ భారత్ గురించి నేతలు చెప్పినదానికీ, కింది స్థాయిలో జరిగినదానికీ ఎక్కడా లంగరు కుదరడంలేదనడానికి దేశంలో 70 శాతం మందికి పైగా ప్రజలు ఈ కార్యక్రమంపై పెదవి విరుస్తున్న తీరే నిదర్శనం. గ్రామాల సంగతి అటుంచితే నగరాలు, పట్టణాల్లో సైతం స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రచారార్భాటంగానే తయారైందన్నది సర్వత్రా వినవస్తున్న మాట.