
ఎన్నికల ఓటింగ్ యంత్రాలపై సిపిఎం గుర్తు మరింత స్పష్టంగా ఎర్రగా కనిపించనుంది. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం అంగీకరించింది. బీహార్ ఎన్నికల అనంతరం దీనిని అమలులోకి తెస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ నసీం జైదీ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి హామీ ఇచ్చారు. ఈ అంశంపై ఏచూరి మంగళవారంనాడు నిర్వాచన్ సదన్‌లో జైదీని కలిశారు. ఇవిఎంలపై తమ పార్టీ గుర్తు సరిగా కనబడటం లేదనీ, మరింత స్పష్టంగా కనిపించ ేలా బోల్డ్‌గా చేయాలని ఏచూరి ఆయనను కోరారు. దీనికి జైదీ అంగీకరించారని, బీహార్ ఎన్నికల తరువాత నుంచి అమలు చేస్తానని చెప్పారనీ తెలిపారు.