
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోది ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. ఓ చోట పోలింగ్ ముగిసిన రోజే ప్రధాని మరోచోట ప్రచారం చేయడం ద్వారా లైవ్ టీవీలో ప్రసారం అవుతుందని, అది ఓటర్లపై ప్రభావం చూపుతుందన్నారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడడం సరి కాదని ఏచూరి పేర్కొన్నారు. ఈవీఎం యంత్రాల్లో లోపాలున్నాయంటూ ఎలక్షన్ కమిషన్‌కు సిపిఎం ఫిర్యాదు చేసింది.