2015

ఐక్య పోరాటాలే శరణ్యం:గఫూర్

కార్మికుల మెడలపై కత్తి వేసే విధంగా ఉన్న ప్రభుత్వ విధానాలను తిప్పకొట్టడానికి ఐక్య పోరాటాలే శరణ్యమని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ పిలుపునిచ్చారు. బుధవారం కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం గుహల ఆవరణంలో నిర్వహించిన సిఐటియు రాష్ట్ర స్థాయి క్లస్టర్‌ సమావేశంలో ఆయన ప్రసంగించారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను సవరిస్తూ, ప్రయివేటు సంస్థలను ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. గత కార్మిక చట్టాల్లో ఎనిమిది గంటల పని దినాలు ఉన్నా, వాటిని ప్రయివేటు యాజమాన్యాల లాభాల కోసం బిజెపి సవరించి తీరుతామని చెప్పడం విడ్డూరమన్నారు.

పొలాలను నాశనం చేయొద్దు:CPM

పంటలు పండే పచ్చటి పొలాలను, ప్రజల జీవితాలను నాశనం చేసే ఆక్వా ఫుడ్‌పార్క్‌ నిర్మాణ పనులను నిలుపుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్‌ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించి, గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్కు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న రైతులతో మాట్లాడారు. జనావాసాల ప్రాంతంలో గోదావరి మెగా ఫుడ్‌పార్క్‌ ఫ్యాక్టరీ నిర్మించొద్దని ఏడాదిగా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. 

ప్రపంచబ్యాంకు పథకం ''మేక్‌ ఇన్‌ ఇండియా''

 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాను రూపొందించిన పథకమం టూ గొప్పగా ప్రచారం చేసుకొంటు న్న ''మేక్‌ ఇన్‌ ఇండియా'' ప్రపంచ బ్యాంకు రూపొందించిన పథకమని స్పష్టమౌతున్నది. 2015 సెప్టెంబ రులో ప్రపంచబ్యాంకు రూపొందించిన ''అసెస్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ ఇంప్లిమెంటేషన్‌ ఆఫ్‌ బిజినెస్‌ రిఫార్మ్స్‌'' నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది. తయారీ సరుకుల ఎగుమతులను, భారతదేశంలో తయారైన సరుకుల పోటీత త్వాన్ని పెంచటానికి సహకరించాలని ప్రధాని మోడీ 2014లో ప్రపంచబ్యాంకును కోరి నట్లు నివేదికకు రాసిన ముందుమాటలో ప్రపంచబ్యాంకు కంట్రీ డైరెక్టర్‌ ఒన్నో రుహుల్‌ పేర్కొన్నాడు.

సీపీఐ ‘పముజుల’పై హత్యాయత్నం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పముజుల దశరథరామయ్యపై నెల్లూరు రూరల్‌ మండలం సౌత్‌మోపూరులో మంగళవారం హత్యాయత్నం జరిగింది. గ్రామ పంచాయతీ చేపట్టిన డ్రైనేజీ కాలువ నిర్మాణ విషయంలో ఈ వివాదం చోటుచేసుకుంది. రూ.5లక్షలతో పంచాయతీ డ్రైనేజీ కాలువ నిర్మిస్తోంది. అయితే, హైస్కూల్‌ కూడలిలో స్థానికంగా నివాసముండే బట్టేపాటి ప్రతాప్‌ కాలువ తమ స్థలంలో ఉందంటూ నిర్మాణ పనులను అడ్డుకున్నాడు. గ్రామపెద్దలు, సీపీఐ సీనియర్‌ నేత పముజుల దశరథరామయ్య జోక్యం చేసుకుని డ్రైనేజీ కాలువ పూర్తిగా పంచాయతీ స్థలంలో ఉందని, రెవెన్యూ సర్వే ప్రకారమే నిర్మాణం జరుగుతోందంటూ తేల్చి చెప్పారు. అయినా మాటవినని ప్రతాప్‌ పముజులపైకి దూసుకెళ్లాడు.

మా తిండి..మా హక్కు:CPM

దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని రకాల ఆధిపత్యం పెరిగిందని, ఇప్పుడు ఏకంగా తినే తిండిని కూడా అది శాసించేందుకు కేంద్రంలో మోడీ సర్కార్‌ ప్రయత్నిస్తోందని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు పినరయి విజయన్‌ ధ్వజమెత్తారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాన్ని ప్రజలపై రుద్ది, తమ పబ్బం గడుపుకోవడానికి బిజెపి, ఆర్సెస్స్‌లు కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు.

బిజెపి కేవలం హెడ్‌లైన్స్‌కే:శౌరి

ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వ విధానాలు కాంగ్రెస్‌ ప్లస్‌ ఆవులా ఉన్నాయని, ఆర్థిక నిర్వహణ మీడియా హెడ్‌లైన్స్‌కే పరిమితమవుతోందని బిజెపి సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ శౌరీ విమర్శించారు. ప్రధాని కార్యాలయం గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా ఉందని శౌరీ వ్యాఖ్యానించారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను గుర్తు చేస్తున్నాయని, అవే విధానాలు..కాకపోతే, కాంగ్రెస్‌ ప్లస్‌ ఆవు అంటూ శౌరీ చమత్కరించారు.

హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి..

 ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించి ప్రత్యామ్నాయ వైద్య సదుపాయాలు అందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌ నరసింగరావు డిమాండు చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఇటీవల డెంగీతో మృతి చెందిన జయశ్రీ,ఇషాంక్‌ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులలో తమ బిడ్డలకు సరైన వైద్యం అందకపోవడం వల్లే మృతి చెందారని బాధిత తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేశారు .  చిత్తూరు జిల్లాలో మూడు నెలల వ్యవధిలో డెంగీతో 20 మంది మృతి చెందారని, ఇతర జ్వరాలతో లక్షా 44 కేసులు నమోదైనా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. 

AIKS రాష్ట్ర మహాసభలు..

అన్నదాతలెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, సంఘటితంగా పోరాడదామని అఖిల భారత కిసాన్‌ సభ సహాయ కార్యదర్శి విజూకృష్ణన్‌ పిలుపునిచ్చారు. గత రెండు దశాబ్దాల్లో దేశవ్యాప్తంగా సుమారు 3.20 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పాలకులు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో మోడీ పాలన చేపట్టాక రైతుల ఆత్మహత్యలు 26 శాతం పెరిగాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

Pages

Subscribe to RSS - 2015