
ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వ విధానాలు కాంగ్రెస్ ప్లస్ ఆవులా ఉన్నాయని, ఆర్థిక నిర్వహణ మీడియా హెడ్లైన్స్కే పరిమితమవుతోందని బిజెపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరీ విమర్శించారు. ప్రధాని కార్యాలయం గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా ఉందని శౌరీ వ్యాఖ్యానించారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను గుర్తు చేస్తున్నాయని, అవే విధానాలు..కాకపోతే, కాంగ్రెస్ ప్లస్ ఆవు అంటూ శౌరీ చమత్కరించారు.