
దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని రకాల ఆధిపత్యం పెరిగిందని, ఇప్పుడు ఏకంగా తినే తిండిని కూడా అది శాసించేందుకు కేంద్రంలో మోడీ సర్కార్ ప్రయత్నిస్తోందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు పినరయి విజయన్ ధ్వజమెత్తారు. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాన్ని ప్రజలపై రుద్ది, తమ పబ్బం గడుపుకోవడానికి బిజెపి, ఆర్సెస్స్‌లు కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు.