2015

బిజెపి కుహనా ఆధ్యాత్మికత..

నిషేధం, దుందుడుకు ధోరణులు, ఆజ్ఞలు, మూసివేతలు లాంటివి సహనస్ఫూర్తినీ లేదా మన రాజ్యాంగాన్ని ప్రతిధ్వనిం చవు. అసహన రాజకీయాలకూ, సహన సిద్ధాంతాన్ని ప్రవచించే జైన మత ఆచారాలకు ముడిపెట్టడం హాస్యాస్పదం. దీనికి సంబంధించి పత్రికల్లో వచ్చే చిన్నచిన్న వార్తలన్నింటినీ పాఠకులు కలిపి చూడాలి. జైనులు ఆచరించే పర్యూషన్‌ (ఉపవాసదీక్ష వేడుక) సందర్భంగా మాంసం విక్రయంపై విధించిన నిషేధానికి సంబంధించి పత్రికలలో వచ్చిన కథనాల తీరు నన్ను బాగా ఆందోళనకు గురిచేసింది. బిజెపి కార్యక లాపాలు ఎవరినీ నొప్పించని విధంగా సున్నితం గా ఉన్నాయని వ్యాఖ్యాతలు విశ్లేషించారు.

Rss నిషేధం గుర్తురాలేదా:లెఫ్ట్

దేశంలో ఐక్యత, శాంతి, సామరస్యత వుంటేనే ప్రగతి సాధ్యమంటూ ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రసంగంపై వామపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. సర్దార్‌ పటేల్‌ పేరిట శనివారం ఇక్కడ 'ఐక్యతా పరుగు' (రన్‌ఫర్‌ యూనిటీ) కార్యక్రమం నిర్వహించిన ఎన్డీయే సర్కారుకు అప్పట్లో హోం మంత్రిగా వున్న పటేల్‌ మహాత్ముని హత్యానంతరం ఆరెస్సెస్‌ నిషేధం విధించిన విషయం గుర్తు రాలేదా అని వారు ప్రశ్నించారు. దేశ ఐక్యత, శాంతి, సామరస్యతల కోసం ఎవరు నిజంగా పనిచేస్తున్నారో ప్రధాని గుర్తించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా అన్నారు. వారంతా (ప్రధాని నేతృత్వంలోని కాషాయదళం) ఆరెస్సెస్‌, సంఫ్‌ు పరివార్‌ సంస్థలకు చెందిన వారే.

దాద్రీ ఘటనకు వినూత్న నిరసన

పిఎల్‌ సుందరం తన పార్టీ కార్యకర్తలతో కలసి 'తమిళ మానిల వివసాయిగళ్‌ సంగం' (తమిళనాడు రాష్ట్ర వ్యవసాయ కార్మికుల అసోసియేషన్‌) ఇక్కడికి 65 కిలోమీటర్ల దూరంలోని సత్యమంగళంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఒక ప్యాకెట్‌ను బయటకు తీసి, ఇది గొడ్డుమాంసమని, దీన్ని తాను తింటున్నానంటూ, కొన్ని ముక్కలను ప్రదర్శనకారులకూ పంచిపెట్టారు. ఒక గంట పాటు జరిగిన ఈ నిరసన ప్రదర్శనకు పోలీసులు గట్టి బందోబస్తు చేశారు.

లెఫ్ట్‌పై జైట్లీ పెదవివిరుపు..

వామ పక్షాలు భారత్‌లో అసహనాన్ని పెంచి పోషిస్తున్నా యని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆరోపిం చారు. బిజెపి, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా సైద్ధాంతిక అసహనాన్ని పెంచి పోషిస్తున్నాయని, ప్రణాళికాబద్ధమైన ప్రచారం ద్వారా భారత్‌ను అసహన సమాజంగా మార్చేస్తున్నారని ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన వ్యాఖ్యలో విమర్శించారు.

రాష్ట్రం విదేశీ కాళ్ళ క్రింద..

రాష్ట్రంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకుగానీ, దానికి సాంకేతిక సలహా ఇచ్చేందుకుగానీ చేసుకున్న ఒప్పందాలన్నీ విదేశీ కంపెనీలకే చెందినవి కావడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని నిర్మాణం మొత్తం మాస్టర్‌ డెవలపర్‌పేరుతో సింగపూర్‌కు కట్టబెట్టగా, రాష్ట్రంలో కోస్తాతీరంలో ఏర్పాటు చేసే ప్రాజెక్టులను జపాన్‌కు అప్పగిస్తోంది.

చంద్రులు ఒక్కటయ్యారు:తమ్మినేని

ఓటుకు నోటు కేసులో ప్రధానమంత్రి దగ్గర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు ఒక్కటయ్యారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. వరంగల్‌ జిల్లా భూపాలపల్లిలో శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ...సహారా కేసు విషయంలో 90 ప్రశ్నలకు కెసిఆర్‌ సమాధానం చెప్పాల్సి ఉండగా ఎందుకు నోరు మెదపట్లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా సిఎం కెసిఆర్‌ వాస్తవాలను బయటపెట్టి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆశాల సమ్మె వెనుక ఆంధ్రా కుక్కలున్నాయని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి నోరు పారేసుకున్నారని, అదే ఆంధ్రా సిఎం చంద్రబాబు మీద కేసు పెట్టే దమ్మూ ధైర్యం ఈ మంత్రులకు ఎందుకు లేదని ప్రశ్నించారు.

కనీసధర కూడా రాలేదు:కృష్ణన్‌

గిట్టుబాటు ధర లేక చెరకు రైతులు కూడా ఆత్మహత్య లకు పాల్పడుతున్నారని అఖిల భారత చెరకు రైతుల సమ న్వయ కమిటీ కన్వీనర్‌ విజ్జూ కృష్ణన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్పత్తి వ్యయంతో పోల్చితే మద్దతు ధర చాలా తక్కువగా ఉండటమే ఇందుకు కారణమన్నారు. చెరకు ఉత్పత్తి వ్యయం టన్ను రూ. 2,500 ఉన్నట్లు కేంద్రమే అంచనా వేసిందన్నారు. 

చట్టాన్ని ధిక్కరిస్తోన్న ప్రభుత్వం:మధు

రైతులు, పేదలు సాగు చేసుకుంటున్న భూములను గుంజుకొని కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రభుత్వ భూ బ్యాంకు విధానాన్ని ఉప సంహరించుకోవాలని భూ హక్కుల పరిరక్షణ కమిటీ డిమాండ్‌ చేసింది.ఈసదస్సులో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు రాష్ట్ర  ప్రభుత్వం చట్టాన్ని ధిక్కరించిందని విమర్శించారు. కర్నూలు జిల్లా శకునాల గ్రామంలో రైతులకు నష్ట పరిహారం చెల్లించకుండానే వారి భూములను లాక్కుందని విమర్శించారు. బందర్‌ పోర్టు భూ సేకరణకు ఎదురు తిరిగిన 29 మంది రైతులపై పోలీసులు నాన్‌బెయిల్‌ సెక్ష న్లతో కేసులు పెట్టారన్నారు.

అంతర్జాతీయ కమ్యూనిస్టు సదస్పు..

ఇస్తాంబుల్‌:కార్మికోద్యమానికి ఎన్నడూ విరామం అనేది వుండదని టర్కీ కమ్యూనిస్టు పార్టీ సీనియర్‌ నేత కేమల్‌ ఒకుయాన్‌ స్పష్టం చేశారు.శుక్రవారం ఇక్కడ ప్రారంభమైన 17వ అంతరా ్జతీయ కమ్యూనిస్టు, శ్రామిక పార్టీల సదస్సును టర్కీ కమ్యూనిస్టు పారీ ్ట తరపున ఆయన లాంఛనంగా ప్రారంభించారు.26 దేశాల కమ్యూనిస్టు, శ్రామిక పార్టీల ప్రతినిధులు పాల్గొని వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను తెలియచేశారు. వీరిలో చైనా కమ్యూనిస్టుపారీ ్ట, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ క్యూబా తదితర పారీ ్టల ప్రతినిధులు మాట్లాడుతూ సోషలిస్టు నిర్మాణంలో తమ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించారు.

Pages

Subscribe to RSS - 2015