
ఇస్తాంబుల్:కార్మికోద్యమానికి ఎన్నడూ విరామం అనేది వుండదని టర్కీ కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత కేమల్ ఒకుయాన్ స్పష్టం చేశారు.శుక్రవారం ఇక్కడ ప్రారంభమైన 17వ అంతరా ్జతీయ కమ్యూనిస్టు, శ్రామిక పార్టీల సదస్సును టర్కీ కమ్యూనిస్టు పారీ ్ట తరపున ఆయన లాంఛనంగా ప్రారంభించారు.26 దేశాల కమ్యూనిస్టు, శ్రామిక పార్టీల ప్రతినిధులు పాల్గొని వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను తెలియచేశారు. వీరిలో చైనా కమ్యూనిస్టుపారీ ్ట, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ క్యూబా తదితర పారీ ్టల ప్రతినిధులు మాట్లాడుతూ సోషలిస్టు నిర్మాణంలో తమ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించారు.