Rss నిషేధం గుర్తురాలేదా:లెఫ్ట్

దేశంలో ఐక్యత, శాంతి, సామరస్యత వుంటేనే ప్రగతి సాధ్యమంటూ ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రసంగంపై వామపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. సర్దార్‌ పటేల్‌ పేరిట శనివారం ఇక్కడ 'ఐక్యతా పరుగు' (రన్‌ఫర్‌ యూనిటీ) కార్యక్రమం నిర్వహించిన ఎన్డీయే సర్కారుకు అప్పట్లో హోం మంత్రిగా వున్న పటేల్‌ మహాత్ముని హత్యానంతరం ఆరెస్సెస్‌ నిషేధం విధించిన విషయం గుర్తు రాలేదా అని వారు ప్రశ్నించారు. దేశ ఐక్యత, శాంతి, సామరస్యతల కోసం ఎవరు నిజంగా పనిచేస్తున్నారో ప్రధాని గుర్తించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా అన్నారు. వారంతా (ప్రధాని నేతృత్వంలోని కాషాయదళం) ఆరెస్సెస్‌, సంఫ్‌ు పరివార్‌ సంస్థలకు చెందిన వారే. దేశవ్యాప్తంగా వారే ఐక్యత, శాంతి, సామరస్యతలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు.