పోలీసు శాఖలో 36.53 కోట్ల అవినీతి, అధికారులకు, రాజకీయ నాయకులకు మధ్య అక్రమ అనుబంధాన్ని తెలియజేస్తున్నది. అవినీతిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.
ఈ చలానాల పేరుతో ఆటో డ్రైవర్లు, వాహన వినియోగదార్ల ముక్కుపిండి, వేదింపులకు గురిచేసి వసూలు చేసిన మొత్తం అవినీతిపాలు కావడం గర్హనీయం. ప్రభుత్వం ఇప్పటికైనా చలానా వేదింపులు ఆపాలి.