బిజెపి అనుసరిస్తోన్న తప్పుడు విధానాల వల్ల దేశంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుందని, దానిని రాష్ట్ర ప్రభుత్వం సమర్ధిస్తుందని, ఇదే జరిగితే దేశ ప్రజలు దివాలా తీస్తారని, ఆర్ధిక భారాలతో విలవిల్లాడుతారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో, దేశంలో అసమానతలు లేనటువంటి అభివృద్ధి సాధించాలన్న నినాదంతో ప్రజలను సమీకరించాలని సిపిఎం భావించిందని, ఆ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.