వ్యవసాయ, ఆక్వా రంగ సమస్యలపై భీమవరంలో రాష్ట్ర సదస్సు..

 ఆక్వారంగం,వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర స్ధాయి సదస్సు భీవరంలో టౌన్‌రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న రైస్‌మిల్లర్స్‌ ఆసోషియేషన్‌ హాలో మద్యాహ్నం 3గంటలకు సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అద్యక్షతన ప్రారంభమైంది. ఈ సదస్సుకు ప్రముఖ రాష్ట్ర రైతు నాయకులు శ్రీ వై.కేశవరావుగారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాంగారు హాజరైయ్యారు.

ఈ సందర్భంగా వై.కేశవరావుగారు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో  వరి,ఆక్వాతో సహా అన్ని పంటల రైతులు చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. దేశానికి అతూ,ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. స్వామినాధన్‌ కమీషన్‌ సిఫార్సు  ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50శాతం కలిపి పంటలకు మద్ధతు ధరలు నిర్ణయిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని బిజెపి కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నారు.ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయి, సరైన ధరలు రాక రైతాంగం ప్రతి సంవత్సరం వేలు,లక్షల కోట్ల రూపాయలు నష్టపోతున్నారన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీగారు మాటలు నీటి మూటలై అప్పులు, ఆత్మ హత్యలు మాత్రం రెట్టింపయ్యాయన్నారు.  కేంద్రం 3 రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి వ్యవసాయాన్ని, సాగుచేసే చేనుని రైతుకు దూరంచేసి కార్పోరేట్‌ శక్తులు, బడాబాబుల అప్పగించాలనే ఆలోచనను రైతులు తిప్పికొట్టారన్నారు. ఢల్లీి వీధుల్లో లక్షల మంది రైతాంగం సంవత్సరం పైగా ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికి,కరోనాకు ప్రాణాలు ఎదురొడ్డి గుండె నిబ్బరంతో,ఆత్మస్థైర్యంతో 750మంది రైతులు ప్రాణాలు కోల్పోయి మోడి ప్రభత్వం తెఇచ్చిన నల్లచట్టాలను తిప్పికొట్టారన్నారు.

  కేంద్రం పార్లమెంటులో ప్రవేశ పెట్టాలనుకున్న విద్యుత్‌ బిల్లు వ్యవసాయానికి ఉరితాడు లాంటిది. రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్ల ప్రతిపాదన, ఇళ్ళకు,షాపులకు స్మార్ట్‌ మీటర్లు బిగింపు ప్రయత్నాలు వ్యవసాయ దారులను, విద్యుత్‌ వినియోగదారులను,షాపుల యజమానులను, వృత్తి దారులను తీవ్రంగ దెబ్బతీస్తుందన్నారు.వేలకోట్లు రైతుల నుండి ముక్కుపిండి ప్రీమియం వసూలు చేసి పంటల నష్టం జరిగినపుడు ఇచ్చేది మాత్రం అరకొరే అన్నారు.రాష్ట్రంలో వరిధాన్యం అమ్మకాల కష్టాలు,ధరలో కోతలు, తేమశాతం నిబంధనలు, సంచులకొరత, వారాలు,నెలలు తరబడి అమ్మిన ధాన్యానికి డబ్బులు రాక రైతులు, కౌలురైతులు,దేవాలయ కౌలురైతులు విలవిల లాడుతున్నారు.

వ్యవసాయ రంగం అభివృద్ధికి ఈ ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు అమలు చేయాలని ఈ సదస్సు తీర్మానం చేసింది

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెంచాలి. (ఇప్పటికీ దేశంలో 50`60 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు) ఆహర భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.

1. రైతులు పండిరచిన అన్ని పంటలకు పెట్టుబడి పై (సి2G50 ఫార్ములా ప్రకారం) 50 శాతం ఆదాయం వచ్చేలా మద్దతు ధరలు నిర్ణయించి అమలు చేయాలి.ధాన్యానికి క్వింటాల్‌ కు కనీస మద్దతు ధర రూ. 2810/- లు అమలు చేయాలి. ధాన్యం కొనుగోళ్లలో వ్యాపారుల దోపిడీకి అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. తేమ, తరుగు పేరుతో కోతలు నిరోధించాలి.కేరళ తరహాలో ధాన్యానికి క్వింటాకు రూ. 900/`బోనస్‌  అన్ని పంటలకు రాష్ట్ర ప్రభుత్వం మద్ధతు ధరలు ప్రకటించి కొనుగోలు చేయాలి.సారవంతమైన పచ్చటి పంటపొలాలు కాపాడాలి.

2. రైతులు, కౌలు రైతులకు రూ.2 లక్షల వరకు అన్ని రకాల బ్యాంకుల రుణాలు మాఫీ చేయాలి. కేరళ తరహలో రాష్ట్రంలో రైతు రుణ విమోచన చట్టం తీసుకురావాలి.(లక్షల కోట్లు బడాబాబులు,కార్పోరేట్లకు మాఫీ చేస్తున్నారు)

3. రైతులకు వ్యవసాయపెట్టుబడులకు రూ.2.లక్షల వరకు సున్నా వడ్డీకి, రూ.5లక్షల వరకు పావలా వడ్డీకి బ్యాంకు రుణాలు ఇవ్వాలి. 

4. రైతు భరోసా రూ 13,500/-లు స్థానంలో ఎకరాకు రూ. 10 వేల చొప్పున 10 ఎకరాల వరకు రైతులు, కౌలు రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించాలి.కేంద్రం వాటా పెంచి సహాయం చేయాలి. 

5. అన్ని పంటలకు సమగ్ర పంటల భీమా అమలు చేయాలి. ప్రైవేటు కార్పొరేట్‌ కంపెనీల లాభాల కొరకు ఉద్దేశించబడిన ప్రధాన మంత్రి ఫసల్‌ బీమాను తిరస్కరించాలి, ప్రధాన మంత్రి ఫసల్‌ భీమా నుండి బయటికి రావాలి. 

6. పోలవరం ప్రాజెక్టు  ముంపు బాధితులకు  పరిహారం ఇచ్చి, పునరావాసం కల్పించి, నిర్మాణం సత్వరమే పూర్తి చేయాలి. 

7. వ్యవసాయ మోటార్‌ లకు మీటర్లు పెట్టి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును ఎత్తి వేసే విద్యుత్‌ రంగ సంస్కరణలు విరమించుకోవాలి. గృహలకు,షాపులకు స్మార్ట్‌ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలి. ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారాన్ని తగ్గించాలి. 

8. రాష్ట్రానికి ప్రత్యేక హోదా,రైల్వేజోన్‌, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలి.నర్సాపురం మినీ హార్బర్‌ నిర్మించాలి. విశాఖ ఉక్కు అమ్మకం ఆపాలి.

9. వ్యవసాయ సహకార పరపతి సంఘాలను కామన్‌ సర్వీస్‌ సెంటర్లు గా మార్చే ప్రయత్నాలను విరమించుకోవాలి.సహకార వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్రైవేటు వ్యాపారులు, కంపెనీల పరం కాకుండా సహకార సంఘాలను నిలబెట్టాలి.ఎరువుల ధరలు తగ్గించాలి. 

10 పాల రైతులకు ప్రభుత్వం ఇస్తామన్న లీటర్‌ పాలకు రూ. 4.00 లు బోనస్‌ ఇవ్వాలి. రాష్ట్రంలో సహకార పాలడైరీలను అమూల్‌ నుండి కాపాడాలి.వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలి.పెట్రోలు,డీజిల్‌,గ్యాస్‌ ధరలు తగ్గించాలి.  

11. చెరకు పంటను ప్రోత్సహించాలి. మూసేసిన తణుకు ఆంధ్ర షుగర్స్‌, రైస్‌మిల్లులు తెరవాలి.కొబ్బరి,ఫౌల్ట్రి,నిమ్మ, అరటి, పసుపు,కంద,తమలపాకు, ఉప్పు, కూరగాయలు, పండ్లతోటలు, సరుగుడు, కోకో, ఆయిల్‌ పాం,పాడి రైతులను అన్ని విధాల ఆదుకోవాలి. 

12. ఆక్వా రైతుల చేపలు, రొయ్యలకు ధర కల్పించి ఆదుకోవాలి.నాణ్యమైన సీడ్‌,ఫీడ్‌ సరఫరా చేయాలి.విద్యుత్‌రాయితీ పునరుద్ధ్దరించాలి. 

13. ఎంపెడా, కేంద్ర వాణిజ్యశాఖ, రాష్ట్ర మత్స్యశాఖలు ఆక్వా రైతుల్ని ఆదుకునే ప్రణాళికలు చేపట్టాలి. అమలు చేయాలి.

14. కౌలురైతులు,దేవాలయ కౌలురైతులు వ్యవసాయ కార్మికులు, చేతివృత్తి దారుల సమస్యలు పరిష్కరించి వారిని అదుకోవాలి. 

15. కాలుష్య నివారణకు ప్రభుత్వాలే బాధ్యత వహించి తగు చర్యలు చేపట్టాలి.వ్యాధులను అరికట్టాలి.అన్ని వ్యాదులను ఆరోగ్యశ్రీలోచేర్చాలి.

16. డెల్టా ఆధునీకరణ పనులు పూర్తిచేసి సాగునీరు, మురుగునీటి పారుదల, త్రాగునీటి వ్యవస్థలను మెరుగుపర్చాలి.

17. వ్యవసాయ, అనుబంధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి.అవసరమైన కొత్తపోస్టులు ఇవ్వాలి. 

18. ప్రతి మూడు నెలలకు ఒకసారి వ్యవసాయ, రెవెన్యూ, బ్యాంకర్లు, జలవనరుల శాఖలు రైతు, కౌలురైతు సంఘాలతో 

ఉమ్మడి సమావేశాలు నిర్వహించి క్షేత్రస్ధాయి సమస్యలు పరిష్కరించాలి.

19 తాడేపల్లిగూడెం ఉద్యానవర్శిటీ,వెంకట్రామన్న గూడెం గేదెల పరిశోధన, ఉండి కృషి విజ్ఞాన కేంద్రం,మత్స్యపరిశోధనాకేంద్రం, మార్టేరు వరి పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేయాలి.ప॥గో జిల్లాలో  ఆక్వా యునివర్శిటీ నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి.