November

ప్రభుత్వానికి కళ్లు లేవు:మధు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్లు లేవని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు తీవ్రంగా విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై వామపక్షాలు విజయవాడ లెనిన్ సెంటర్ లో ధర్నా నిర్వహించాయి. ఈ ధర్నానికి సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మధు మాట్లాడారు. ప్రభుత్వం పన్నుల విధానంలో మార్పు తీసుకురావడం వల్ల ధరలు పెరిగిపోయాయన్నారు. రైతు దగ్గర నుండి తీసుకున్న ధరకు నిమిత్తం లేకుండా అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

బాక్సైట్‌ తవ్వకాలు ప్రైవేట్ వారికి వద్దు..

విశాఖ మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలకు కేంద్ర పర్యావరణ, మంత్రిత్వశాఖ అనుమతులు ఇవ్వడం దారుణమని, దీనిని తక్షణమే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్‌ నర్సింగరావు డిమాండ్‌ చేశారు. మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ నాయకులు ప్రజలను మభ్య పెట్టారనే విషయం ఈ జీవోతో వెల్లడైందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల ప్రకారం బాక్సైట్‌ తవ్వకాలకు మార్గం సుగమం అయిందని, ఈ జీవోలో 1212 హెక్టార్లలో బాక్సైట్‌ తవ్వకాలు చేపడితే దానికి రెట్టింపు హెక్టార్లలో మొక్కలు నాటాలని చెబుతున్నారని అన్నారు.

'నిజం' పేరుతో అబద్ధాలా?

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గురువారం ఇక్కడ విడుదల జేసిన పుస్తకం 'నిజం తెలుసుకోండి' (నో ది ట్రూత్‌)లో కొత్తదనమేమీ లేదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి చెప్పారు. లెఫ్ట్‌పై బిజెపి గతంలో చేసిన ఆరోపణలను ఇందులో మరోసారి ప్రస్తావించారని ఏచూరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో మేధావుల ఆలోచనలను లెఫ్ట్‌ తప్పుదోవ పట్టిస్తోందని అందులో విమర్శించారని, వామపక్ష మేధావుల ఆలోచనా ధోరణి పరిశీలనాత్మకంగానే వుం టుందని, ఇకపై కూడా అదే విధంగా కొనసాగుతుందని ఏచూరి స్పష్టం చేశారు. వారి మేధోసంపత్తి, హేతు వాదం, చరిత్ర అధ్యయనం వంటివి ఇందుకు ప్రధాన కారణాలని ఆయన వివరించారు.

కమలం ఎప్పటికి వికసించేనో..?

తాజా బిహార్‌ ఎన్నికల్లో వాడిపోయిన కమలం.. ఇప్పట్లో వికసించే సూచనలు కనిపించడం లేదు. రానున్న 2016లో దేశంలోని నాలుగు ప్రధాన రాష్ర్టాలు సహా ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఆయా రాష్ర్టాల్లోనూ బీజేపీ గెలిచే అవకాశం ఎంత మాత్రమూ లేదు! ఎందుకంటే ఆయా రాష్ర్టాల్లో స్థానిక పార్టీల హవా ఉధృతంగా కొనసాగుతుండడం, జాతీయ పార్టీ అయిన బీజేపీకి అంత ప్రాబల్యం లేకపోవడమే కారణం. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌, అస్సాం సహా పుద్దుచ్చేరి అసెంబ్లీలకు 2016లో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ర్టాల్లో బీజేపీకి ప్రజల్లో ఆదరణ ఆశించిన మేరకు లేదు. 

కేరళ ప్రజలకు సిపిఎం అభినందనలు

కేరళ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌కు విజయం కట్టబెట్టిన కేరళ ప్రజలను సిపిఎం అభినందించింది. ఈ ఎన్నికల తీర్పుతో, యుడిఎఫ్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక రికార్డును, అవినీతిని ప్రజలు తిరస్కరించినట్లైందని సిపిఎం పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. అలాగే బిజెపి మతోన్మాద రాజకీయాలను కూడా ప్రజలు తోసిపుచ్చారని, కుల ప్రాతిపదిక సంఘాల నాయకులను కూడగట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను కూడా ప్రజలు నిర్ద్వం ద్వంగా తోసిపుచ్చారని ఈ తీర్పుతో వెల్లడైందని పేర్కొంది.

మతఘర్షణల వెనుక RSS: బృందా

 దేశంలో చోటు చేసుకునే మత ఘర్షణలు, అల్లర్ల వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర వుందని, ఈ విషయంలో తాను చెప్పినవన్నీ వాస్తవాలని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యు రాలు బృందా కరత్‌ స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి వేసిన ప్రతి ఒక్క విచారణా కమిషనూ మత ఘర్షణల వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రమేయాన్ని నిర్ధారించిన విషయాన్ని బృందాకరత్‌ ఈ సందర్భంగా ఉదహరించారు.

ధరల పెరుగుదలపై 9న నిరసన..

 పెరిగిన నిత్యావసర సరకుల ధరలను అరికట్టాలనే డిమాండ్‌తో 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, డివిజన్‌, మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించాలని 9 వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. 

స్టేట్ సెక్రటేరియట్‌ గన్నవరంలో

గన్నవరంలోని ఐటి పార్కు (మేధా టవర్స్‌)ను సెక్రటేరియట్‌గా ఉపయోగించుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. సోమవారం విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వ చ్చే ఏడాది ప్రభుత్వ కార్యాలయాలు దీనిలో ఏర్పాటు చేయొచ్చని ప్రభుత్వం సూచాయిగా చెప్పుకొచ్చింది. ఇప్పుడు మంత్రివర్గ నిర్ణయంతో అది కార్యరూపం దాల్చినట్లయింది.

Pages

Subscribe to RSS - November