November

VRAల దీక్షకు మద్దతు:మధు

విఆర్‌ఎల దీక్షలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, వారి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎపిపిఎస్‌సి ద్వారా నియమితులైన 5,600 మంది విఆర్‌ఎలకు తగిన పారితోషికం చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం బాధాకరమన్నారు. రెవెన్యూ శాఖలో శాశ్వత ఉద్యోగులకు చెల్లిస్తున్న జీతభత్యాలను విఆర్‌ఎలకూ చెల్లించాలని కోరారు.

అధిక ధరలపై గళమెత్తిన వామపక్షాలు

పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు నిరసనగా వామపక్షాలు నిరసన గళమెత్తాయి. ధరలను నియంత్రించకపొతే ఉద్యమాలను ఉదృతం చేస్తామని, ప్రజాప్రతిఘటన తప్పదని హెచ్చారించాయి. రాష్ట్ర వ్యాపితంగా అధిక ధరలకు నిరసనగా వామపక్ష పార్టీల పిలుపు మేరకు సోమవారం జిల్లా వ్యాపితంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గుంటూరు శంకర్‌ విలాస్‌ సెంటర్‌ నుండి అంబేద్కర్‌ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

సిఎంను నిద్రపోనివ్వం:గఫూర్

కార్మిక వ్యతిరేక విధానాలను మార్చుకోకపోతే ప్రధాని మోడీ, సిఎం చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తామని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌ హెచ్చరించారు.  సిఐటియు పశ్చిమగోదావరి జిల్లా పదో మహాసభల ముగింపు సందర్భంగా జరిగిన బహిరంగ సభలో గఫూర్‌ మాట్లాడారు. పారిశ్రామిక ప్రగతిని స్వాగతిస్తున్నామని, ఈ పరిణామంలో కార్మిక చట్టాలకు విఘాతం కలిగితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కార్మికుల ఐక్యత దెబ్బతీయడానికి ఐదు కార్మిక వ్యతిరేక చట్టాలను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.

BJPతీరు సరికాదు:MLCశర్మ

భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలని కోరుతూ విశాఖ నగరంలోని మేథావులు, రచయితలు, కళాకారులు సోమవారం ప్రదర్శన నిర్వహించారు.ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ మాట్లాడుతూ, దేశంలో వివిధ మతాలకు చెందిన ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బిజెపి నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గొడ్డు మాంసం తిన్నవాళ్లు ఈ దేశంలో ఉండొద్దని ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను అవమానించడమే అవుతుందన్నారు.

కాషాయాన్ని వెంటాడుతున్న కమ్యూనిస్టు భూతం

మామూలుగా ఎన్నికల ప్రచార సమయంలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ ఉంటుంది. పోలింగ్‌ ముగిసిన మరుక్షణంలో మొదలయ్యే ఎగ్జిట్‌ పోల్స్‌ ఆ కుతూహలానికి కొంత సమాధానమిస్తాయి. ఎన్నికల సర్వేల కన్నా ఎగ్జిట్‌ పోల్స్‌ వాస్తవ ఫలితాలకు కొంత దగ్గరగా ఉంటాయనేది సాధారణంగా ఉన్న భావన. కానీ ఇప్పుడు బీహార్‌ ఎన్నికల విషయంలో ఎగ్జిట్‌ పోల్స్‌ ఉత్కంఠను మరింత పెంచేశాయి. విజయం గురించిన అంచనాలలో విపరీతమైన తేడా ఇందుకు కారణం. రెండు మినహా మిగిలిన ఛానల్స్‌ జెడియు-ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూటమికి ఆధిక్యత లేదా మొగ్గు ఉంటుందని చెప్పాయి. టుడేస్‌ చాణక్య, ఎక్స్‌ప్రెస్‌ సిసిరో మాత్రం బిజెపి ఎన్‌డిఎ కూటమికి అధికారం వస్తుందంటున్నాయి.

ప్రజాస్వామ్య సంస్కృతి..

 మధ్యయుగాల నాటి సామాజిక జీవితపు పోకడలతో పోలిస్తే ఆధునిక ప్రజాస్వామ్యం ఒక సుగుణం. శతాబ్దాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఉదాత్తాంశం. సకల రంగాల్లో వ్యక్తి స్వేచ్ఛకూ, సమానత్వానికీ, ఎంచుకునే హక్కుకూ మూలం ప్రజాస్వా మ్యం. రాచరికపు సంస్కతికి భిన్నమైన ప్రజాస్వామ్యం ఓ అందమైన భావన. ఆచరణలో విరుద్ధాంశాలు కనిపించినప్పటికీ మౌలికంగా ప్రజాస్వామ్య సూత్రాలకు బద్ధులై ఉండాలన్న భావనలు 1950 కాలం నాటికి బలపడ్డాయి. కాలం గడుస్తున్న కొద్దీ ఈ భావనలు మరింత శక్తిని పుంజుకుని ప్రజాస్వామ్య సంస్కతి పరిఢవిల్లాల్సింది.

నయవంచన..

పోర్టులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్ల పేరిట పేదల భూములను బెదిరింపు ఎత్తుగడలతో బలవంతంగా గుంజుకొంటున్న చంద్ర బాబు సర్కార్‌..ఇప్పుడు గిరిజన బతుకులను బూడిదపాల్జేసేందుకు నయవం చనకు పాల్పడింది. పర్యావరణవేత్తల ఆందోళనలను, గిరిజనుల ఆవేదనలను ఏమాత్రం పట్టించుకోకుండా, గతంలో ఇచ్చిన హామీలను విస్మరించి మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతులివ్వడం దుర్మార్గం. విశాఖ జిల్లా నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని చింతపల్లి, జెర్రెలలో 1212 హెక్టార్ల అటవీభూమిని ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థకు బదలాయించింది.

26 నుంచి పార్లమెంట్ సమావేశాలు..

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నవంబర్‌ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌ 23 వరకు కొనసాగనున్నాయి. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పార్లమెంట్‌ సమావేశాలపై ఆసక్తి నెలకొంది. సోమవారం కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు పార్లమెంట్‌ సమావేశాలపై నిర్ణయం తీసుకున్నారు

అమరావతిలో మట్టి సత్యాగ్రహం..

 ప్రత్యేక హోదా సాధించేవరకు నిరంతరం పోరాటం చేస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో మట్టి సత్యాగ్రహాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హోదా సాధించేవరకు పోరాటం చేస్తామని కాంగ్రెస్‌ కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది చేత మట్టిని సేకరించి మోదీకి పంపుతామని రఘువీరారెడ్డి అన్నారు.

Pages

Subscribe to RSS - November