November

పార్లమెంట్‌ టు రాష్ట్రపతిభవన్‌..

దేశవ్యాప్తంగా దాడులు, రచయితలు, మేధావుల నిరసనలతో ఉడుకెక్కిన వాతావర ణంపై కాంగ్రెస్‌ పార్టీ తొలిసారి రోడ్డెక్కింది. ‘అసహన స్థితి’ని తొలగించాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కోరుతూ..కాంగ్రెస్‌ అధినాయకత్వమంతా దేశ రాజధానిలో కదం తొక్కింది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, ప్రధాని నరేంద్ర మోదీ పోడకలను నిరసిస్తూ .... ఏఐసీసీ చీఫ్‌ సోనియాగాంధీ, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నాయకత్వంలో పాదటయాత్రగా ముందుకు కదిలింది. పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్‌కు దారితీసే మార్గంలో, ప్లకార్డులు, బ్యానర్లు, నల్ల జెండాలతో కాంగ్రెస్‌ శ్రేణులు ప్రదర్శన సాగించాయి.

మైలవరంలో భూపోరాటం..ఉద్రిక్తత

కృష్ణాజిల్లా మైలవరం అయ్యప్పనగర్‌లో సిపిఎం మైలవరం మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం భూ పోరాటం జరిగింది. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.వి.ఆంజనేయులు నేతృత్వంలో పేదలు తమకు ఇళ్ల స్థలాలివ్వాలని కోరుతూ 9.43 ఎకరాల భూముల్లో గుడిసెలు వేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని నాయకులను అరెస్టు చేసి స్థానిక స్టేషనుకు తరలించారు. అరెస్టులపై ఆగ్రహించిన పేదలు అక్కడి నుంచి ప్రదర్శనగా వచ్చి తహశీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించి నాయకులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

సామాజిక భద్రతఏది? :గఫూర్

అసంఘటిర రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గపూర్‌ డిమాండ్‌ చేశారు. అసంఘటిత కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం ఒంగోలులో కలెక్టరేట్‌ వద్ద మహాధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.మజుందార్‌ అధ్యక్షతన జరిగిన ధర్నాలో గపూర్‌ ముఖ్య వక్తగా విచ్చేసి మాట్లాడారు. అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించి సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీలకు పెంచిన వేతన జీవోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

బినామీ పేర్లతో భూములు స్వాహా..

భూసేకరణకు ప్రభుత్వం సమాయత్తం కావడంతో కృష్ణానది చెంతనే ఉన్న లంక భూముల్లో రాజకీయ నాయకులు రాబందుల్లా వాలిపోతున్నారు. భూయజమానులను నయానో, భయానో బెదిరించి వారి నుంచి బినామీ పేర్లతో వాటిని కొనుగోలు చేస్తున్నారు. తక్కువ డబ్బు ముట్టచెబుతూ సొంతం చేసుకుంటున్నారు. సేకరణకు ఉద్దేశించిన భూముల్లో జరీబు, అసైన్డ్‌ భూములున్నాయి. జరీబు భూములకు రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. అసైన్డ్‌ భూములకు బినామీ పేర్లలో పెండింగ్‌ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఈ లావాదేవీల్లో అధికార పార్టీ నాయకులే ఎక్కువగా ఉన్నారు.

ప్రభుత్వమే భూమాఫియాను పోషిస్తోంది..

చంద్రబాబు ప్రభుత్వంపై విశాఖ జిల్లా  సీపీఎం కార్యదర్శి లోకనాధం ఆగ్రహం వ్యక్తం చేసారు. భూసేకరణ పేరుతో భూమాఫియాను ప్రభుత్వం తయారు చేస్తుందని మండిపడ్డారు. 2005లో నావెల్‌ బెస్‌ స్పెషల్‌ ఆపరేషన్ పేరుతో 4,100 ఎకరాలు సేకరించి 10 ఏళ్లవుతున్నా నేటికి 5 లక్షల పరిహారం చెల్లించలేదని ధ్వజమెత్తారు. మత్స్యకారుల సంపదను దోపిడి చేస్తూ కోస్టల్‌ తీరాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. 

ఎన్.ఎ.ఒ.బి నిర్వాసితులందరికీ న్యాయం చేయాలి.

                నేవల్‌ ఆల్టర్నేట్‌ ఆపరేటివ్‌ బేస్‌ (ఎన్‌ఎఒబి) పేరుతో 2005లో ఎస్‌.రాయవరం, రాంబిల్లి మండలాల్లో 4412.53 ఎకరాల భూమి సేకరించడం జరిగింది. అందులో వేల్పుగుంటపాలెం, రేవువాతాడ, దేవళ్లపాలెం, పిసినిగొట్టిపాలెం గ్రామాల నిర్వాసితులకు ఎన్‌ఎఒబి కాలనీ పేరుతో 373 మందికి ఇళ్లు నిర్మాణం చేయడం జరిగింది. ఇందులో  మిగిలిన 34 మందికి దిబ్బపాలెం ఆర్‌హెచ్‌ కాలనీ ఇళ్లు కేటాయింపు జరిగాయి. మొత్తం 407 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. వీరు కాకుండా బంగారమ్మపాలెం, కొత్తపట్నం, వాడనర్సాపురం, యాతకొత్తపట్నం, కొప్పిగుంటపాలెం గ్రామాలను ప్రభావిత గ్రామాలగా గుర్తించారు.

ఎమర్జెన్సీ ముందు రోజులకన్నా ఘోర పరిస్థితి..

బెంగాల్‌లో ప్రస్తుతం 1970వ దశకం నాటి దారుణ పరిస్థితులు నెలకొని వున్నాయని రాష్ట్ర వామపక్ష సంఘటన చైర్మన్‌ బిమన్‌ బసు చెప్పారు. కోల్‌కతాలో ఆయనను ఇటీవల ప్రజాశక్తి విలేకరి సందీప్‌ చక్రవర్తి ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా సమకాలీన జాతీయ, రాష్ట్ర పరిస్థితులపై ఆయన తన మనసులోని మాటను పంచుకున్నారు.
బెంగాల్‌లో ప్రస్తుత పరిస్థితి గురించి వివరిస్తారా?

మరో 8 వేలకోట్ల అప్పులు:యనమల

కాకినాడ: 'ఖజానా ఖాళీ అయింది... ఇప్పటికే రూ.8 వేల కోట్లు అప్పులు చేశాం. మరో రూ.8 వేల కోట్ల వరకూ అప్పులు చేసేందుకు అవకాశం ఉంది. ఈపరిస్థితుల్లో అభివృద్ధి చెందిన ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలంటే కాస్త ఊపిరి పీల్చుకునేందుకు సమయం అవసరం. ఇది రెవెన్యూ ఉద్యోగులు అర్థం చేసుకోవాలి' అని ఆర్థికశాఖమంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. 

కాంగ్రెస్సా పాఠాలు చెప్పేది..?

అసహనం గురించి తమ ప్రభుత్వానికి పాఠాలు చెప్పే అర్హత కాంగ్రెస్‌కు లేదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. 1984లో సిక్కులపై జరిగిన దాడులను గుర్తు చేస్తే కాంగ్రెస్‌ సిగ్గుతో తల దించుకోవాల్సివుంటుందని మోడీ మండిపడ్డారు. ఈరోజు నవంబర్‌ 2..1984ను గుర్తు చేసుకుందామా? ఇందిరాగాంధీ హత్య(అక్టోబర్‌ 31) తర్వాత రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు..ఢిల్లీతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో లక్షలాది సిక్కులపై దాడులు జరిగాయి..కాంగ్రెస్‌ పార్టీ నేతలపై బలమైన ఆరోపణలున్నాయి. బాధితుల గాయాలు ఇంకా మానలేదు, వారి కన్నీళ్లు ఇంకా ఇంకిపోలేదని మోడీ అన్నారు. 

భారత్‌నుంచి భారీగా బ్లాక్‌మనీ..

భారత్‌ నుండి లక్షల కోట్ల రూపాయల నల్లధనం బయటకు తరలిపోతు న్నదని హెచ్‌ఎస్‌బిసి ప్రజావేగు హెర్వే ఫాల్సియాని చెప్పారు. ఈ విషయంలో తనకు రక్షణ కల్పిస్తానంటే చిట్టా విప్పుతానని, భారత్‌ దర్యాప్తు సంస్థలకు సహకారమందిస్తానని చెప్పారు. హెచ్‌ఎస్‌బిసి జెనీవా బ్రాంచ్‌లో ఖాతాదారుల వివరాలను లీక్‌ చేసినట్లు ఫాల్షియానీ స్విజర్లాండ్‌లో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆయన తొలుత ఫ్రెంచ్‌ ప్రభుత్వానికి, తరువాత భారత్‌ ప్రభుత్వానికి బ్యాంకు ఖాతాదారుల వివరాలను అందించిన విషయం తెలిసిందే.

Pages

Subscribe to RSS - November