నేవల్ ఆల్టర్నేట్ ఆపరేటివ్ బేస్ (ఎన్‌ఎఒబి) పేరుతో 2005లో ఎస్.రాయవరం, రాంబిల్లి మండలాల్లో 4412.53 ఎకరాల భూమి సేకరించడం జరిగింది. అందులో వేల్పుగుంటపాలెం, రేవువాతాడ, దేవళ్లపాలెం, పిసినిగొట్టిపాలెం గ్రామాల నిర్వాసితులకు ఎన్‌ఎఒబి కాలనీ పేరుతో 373 మందికి ఇళ్లు నిర్మాణం చేయడం జరిగింది. ఇందులో మిగిలిన 34 మందికి దిబ్బపాలెం ఆర్‌హెచ్ కాలనీ ఇళ్లు కేటాయింపు జరిగాయి. మొత్తం 407 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. వీరు కాకుండా బంగారమ్మపాలెం, కొత్తపట్నం, వాడనర్సాపురం, యాతకొత్తపట్నం, కొప్పిగుంటపాలెం గ్రామాలను ప్రభావిత గ్రామాలగా గుర్తించారు.