భారత్‌నుంచి భారీగా బ్లాక్‌మనీ..

భారత్‌ నుండి లక్షల కోట్ల రూపాయల నల్లధనం బయటకు తరలిపోతు న్నదని హెచ్‌ఎస్‌బిసి ప్రజావేగు హెర్వే ఫాల్సియాని చెప్పారు. ఈ విషయంలో తనకు రక్షణ కల్పిస్తానంటే చిట్టా విప్పుతానని, భారత్‌ దర్యాప్తు సంస్థలకు సహకారమందిస్తానని చెప్పారు. హెచ్‌ఎస్‌బిసి జెనీవా బ్రాంచ్‌లో ఖాతాదారుల వివరాలను లీక్‌ చేసినట్లు ఫాల్షియానీ స్విజర్లాండ్‌లో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆయన తొలుత ఫ్రెంచ్‌ ప్రభుత్వానికి, తరువాత భారత్‌ ప్రభుత్వానికి బ్యాంకు ఖాతాదారుల వివరాలను అందించిన విషయం తెలిసిందే.