November

ఓటమిపై బీజేపీలో అంతర్మథనం..

బీహార్ ఎన్నికల్లో ఓటమిపై బీజేపీలో అంతర్మథనం మొదలైంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌‌తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా భేటీ అయ్యారు. బీహార్ ఎన్నికల్లో ఓటమికి ఆర్ఎస్ఎస్ సహకరించిందన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.బీహార్‌లో ఆర్ఎస్ఎస్ ఎన్నిక చేసిన అభ్యర్థులను కాకుండా బీజేపీ స్వతహాగా అభ్యర్థులను పోటీకి నిలబెట్టినట్లు మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. అందుకే రిజర్వేషన్లు పున:సమీక్షించాలంటూ ఆర్ఎస్ఎస్ కావాలనే ప్రచారం చేసిందన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి.

రాష్ట్రంలో ధరలు మండుతున్నాయ్:నర్సింగరావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో ధరలు భగ భగ మండిపోతున్నాయని వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలని హితవు పలికారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు నిరసనగా వామపక్షాలు విశాఖ జిల్లాలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా సీపీఎం నేత సీహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ 16 నెలల క్రితం ధరలు తగ్గిస్తామని అధికారంలోకి చంద్రబాబు వచ్చారని గుర్తు చేశారు. కానీ ధరలను విపరీతంగా పెంచేశారని, ఇందులో పోషకాహార సరుకులు కూడా ఉన్నాయన్నారు. పలు కంపెనీలు పప్పులు నిల్వ చేసుకుంటుంటే వాటిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు.

బీహార్‌లో పెరిగిన వామపక్షాలబలం

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్దులు ఈసారి తమ ప్రాతినిధ్యం పెంచుకున్నారు. సీపీఐ ఎంఎల్‌ అభ్యర్ధులు మూడు చోట్ల విజయం సాధించారు. దరౌలీ, బలరామ్‌పూర్‌, జిరదై అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్ధులు విజయం సాధించారు. ఇంతకు ముందు సీపీఐ ఎంఎల్‌కు బీహార్‌ అసెంబ్లీ ప్రాతినిధ్యం లేదు. పశ్చిమ బీహార్‌లోని దరౌలీలో ఎంఎల్‌ అభ్యర్ధి 13 వేల ఓట్ల ఆధిక్యత సాధించారు. బలరామ్‌పూర్‌లో సీపీఐ ఎం ఎల్ అభ్యర్ధి మెహబూబ్‌ అలీ 22 వేల కోట్ల మెజారీటీతో గెలుపొందారు. 2010 అసెంబ్లీ ఎన్నికల్లో మెహబూబ్‌ అలీ 2500 కోట్ల తేడాతో ఓడిపోయారు.

APకి ప్రత్యేకహోదాఇవ్వాలి:CPM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజినివ్వాలని సిపిఎం నగర కార్యదర్శి డాక్టర్‌ బి.గంగారావు డిమాండ్‌ చేశారు. విశాఖ జిల్లా పెందుర్తి సుజాతనగర్‌లోని ప్రయివేటు కల్యాణమండపంలో వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యాన ఆదివారం సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ, ప్రత్యేక హోదాకు, ప్యాకేజికి తేడా ఉందన్నారు. ప్రత్యేక హోదానిస్తే కేంద్రం నుంచి 10 శాతం నిధులు, 90 శాతం గ్రాంట్లు వస్తాయన్నారు. పట్టిసీమపై ఉన్న శ్రద్ధ ఉత్తరాంధ్రపై లేదని, సుజలస్రవంతిని విస్మరించారని విమర్శించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టిన మోడీకి బీహారు ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పారని విమర్శించారు. 

పింఛన్ల నిలిపివేత..దళితుల ఆవేదన

రాజధానికి శంకుస్థాపన జరిగిన గ్రామాల్లో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. పేదలకివ్వాల్సిన పెన్షన్లు ఎగ్గొట్టేందుకు అన్ని మార్గాలనూ అన్వేషిస్తోంది. ఇటీవల నిరు పేద దళితులకు పొలాలున్నాయంటూ పెన్షన్లు ఆపేశారు. ఈ సమస్య శంకుస్థాపన చేసిన గ్రామాల్లోనే ఎక్కువగా ఉంది. పేద దళితులకు కనీసం పని కూడా కల్పించటం లేదు. వారిలో ఆవేదన కట్టలు తెంచుకుంటోంది. ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. తమకు పొలాలు లేకపోయినా ఉన్నాయనే పేరుతో పెన్షన్లు ఎత్తేశారని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సర్కారీ ఘాతుకాలు..

జాతికి అన్నం పెట్టే రైతుల ఆత్మహత్యలు పెను విషాదం కాగా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వానిది పెద్ద ఘాతుకం. ఒక వైపు చంద్రబాబు సర్కారు నవ్యాంధ్ర అభివృద్ధి నమూనా చిత్రాన్ని రంగుల్లో ఆవిష్కరిస్తుం డగా ఇంకో వైపు రైతుల బలవన్మరణాల పరంపర కొనసాగింపు రాష్ట్రంలో నెలకొన్న రెండు విభిన్న ధోరణులకు నిదర్శనం. అన్నపూర్ణగా పిలిచే ఆంధ్రసీమలో కాడెత్తాల్సిన అన్నదాతలు ఉరితాళ్లకు వేలాడుతున్నా పంట పండించాల్సిన వ్యవసాయదారులు పొలంలోనే పురుగు మందు తాగి విగత జీవులవుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. పైగా తెలంగాణాతో పోలికపెట్టి ఎపిలో తక్కువని ఆత్మవంచన చేసుకోవడం క్షమించరానిది.

హోదారాదనిCM,PMలకు తెలుసు:జేసీ

 ప్రత్యేకహోదాపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హోదా రాదని పీఎం, సీఎం, కేంద్రమంత్రులకు తెలుసన్నారు. ప్రజలను మభ్యపెట్టడం ఎందుకని కేంద్ర, రాష్ట ప్రభుత్వాలనుద్ధేశించి అన్నారు.

కార్మికోద్యమస్ఫూర్తి ప్రదాత అక్టోబర్‌విప్లవం

పెట్టుబడిదారులు, వారి కిరాయి రచయితలు పండుగజేసుకుని పట్టు మని పాతికేళ్ళు కాలేదు. ఫుకయామా ''చరిత్ర అంతమైందని'' ప్రకటించి నేటికి 23 ఏళ్లు. మార్క్స్‌ చెప్పిన ''వేతన బానిసలు'' (కార్మికవర్గమే) లేరని ఆండ్రీ గోర్జ్‌ అంతకు ముందే ప్రకటించాడు. సోవియట్‌లో సోషలిజం కూలిపోయినప్పుడు, అప్పటికే తూర్పు ఐరోపా దేశాలు పెట్టుబడి కబంద హస్తాల్లో చిక్కినప్పుడు ''సామ్రాజ్యం'' పులకించి పోయింది. ఆ మైకంలో ఫ్రాన్సిస్‌ ఫుక యామా పలవరింపే పైన చెప్పిన ''చరిత్ర అంతం''! మన దేశంలోని వారి తాబేదార్లు, జీతగాళ్ళు, ''అన్ని యిజాలు విఫలమ య్యాయి. ఇక భవిష్యత్‌ అంతా టూరిజ ందే!'' అని ప్రవచించారు.

హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి..

హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్వంలో నెల్లూరు డిఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.దోమల నుంచి రక్షించండి, హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి, డెంగ్యూ, విషజ్వరాలను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ కార్యకర్తలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్‌ మాట్లాడుతూ జ్వరాలతో ప్రజలు అల్లాడుతుంటే పాలకులు, అధికారులు కబోది పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అందడంలేదన్నారు.

Pages

Subscribe to RSS - November