సుజనావ్యాఖ్యలను ఖండించిన ఐద్వా

ఎన్డీయే ఎన్నికల వాగ్దానాల మేరకు మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి. ప్రభావతి, డి.రమాదేవి ప్రకటనలో కోరారు. మహిళలకు రిజర్వే షన్లు అవసరం లేదన్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యలను ఖండించారు. అన్ని రంగాలతోపాటు రాజకీయాల్లో కూడా తీవ్ర అసమానతలున్నాయని, పార్లమెంటు, శాసనసభల్లో 10 శాతానికి మించి మహిళలు లేరని తెలిపారు. కనీసం 33 శాతం వరకైనా రిజర్వేషన్లు ఉంటే తప్ప రాజకీయ రంగంలో స్త్రీలు నిలదొక్కుకునే పరిస్థితి లేదని పేర్కొన్నారు.